eesha
-
భారత్‌లో లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ భారత్‌లో ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ బాలెన్సియాగా తొలి స్టోర్‌ను ప్రారంభించారు. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్).. ఫ్రెంచ్ కార్పొరేషన్ కెరింగ్ సంస్థతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం తర్వాత జియో వరల్డ్ ప్లాజాలో స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. ఈ మాల్ లో డియోర్, గూచీ, లూయిస్ విట్టన్, రోలెక్స్ తో పాటు దాదాపూ 20కి పైగా హై-ఎండ్ బ్రాండ్ల విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జియో వరల్డ్ ప్లాజాలోనే బాలెన్సియాగా బ్రాండ్స్ అమ్మకాలు సైతం ప్రారంభించినట్లు రిలయన్స్ రీటైల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమియం బ్రాండ్స్ ఆర్బీఎల్ ప్రీమియం ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విభాగాలలో గ్లోబల్ బ్రాండ్లను లాంచ్ చేసేందుకు సుమఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అర్మానీ ఎక్స్ఛేంజ్, బర్బెర్రీ, క్లార్క్స్, కోచ్, డీజిల్, డూన్, ఈఎస్7, ఎంపోరియో అర్మానీ, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్లీస్, హ్యూగో బాస్, హంకెమోలర్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూయార్క్, మనీష్ మల్హోత్రాలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేసింది. -
అందుకే నిర్మాతగా మారా!
‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.. ► ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్‌ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ని ఇచ్చా. ► హీరోగా కూల్‌గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్‌కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్ అవసరం. ► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్‌మెంట్. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి. ► ‘అ’ కమర్షియల్ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ► మా 18 మంది కజిన్స్లో యూజ్లెస్ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను. ► ‘అ’ సినిమా కమర్షియల్‌గా హిట్ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు. ► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్ కదా అని రెమ్యునరేషన్ తగ్గించలేదు. డేట్స్‌ని బట్టి తీసుకున్నారు. ► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నా. యాక్టర్‌గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్ డిపార్ట్మెంట్లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ). ► శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్ తిరుమల, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తా. -
నవ్వులే నవ్వులు
వైవిధ్యమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దిట్ట. ‘క్షణం’తో సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు అడివి శేష్. ‘అష్టా చమ్మా’ ద్వారా నటుడిగా పరిచయమై, ‘ఊహలు గుసగుసలాడే’తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని కూడా నిరూపించుకున్నారు. సక్సెస్‌లో ఉన్న ఇంద్రగంటి–శేష్–అవసరాల కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈష, అదితీ మ్యానికల్ ముఖ్య పాత్రల్లో ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ’ పతాకంపై ఇంద్రగంటి దర్శకత్వంలో కె.సి. నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తు్తన్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్. -
అల్లరి నరేష్ ‘బందిపోటు’ స్టిల్స్
-
అల్లరి నరేష్ బంధిపోటు మూవీ ప్రారంభం
-
తెలుగమ్మాయిలకు ఏం తక్కువ?
తారాస్వరం నటించడం అంత తేలిక కాదు. నటనను నిజమని నమ్మించడం అంత సులభమూ కాదు. అందుకే నటించడం మొదలుపెట్టిన చాలా కాలానికి కానీ సహజమైన నటనను పండించడం సాధ్యం కాదు కొందరికి. కానీ ఈషా తొలి సినిమా ‘అంతకు ముందు ఆ తర్వాత’లోనే అత్యంత సహజంగా నటించింది. అందరి ప్రశంసలనూ అందుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా తన ఎంట్రీ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెబుతోన్న విశేషాలు... తొలిసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు....? నా సినిమా నేను తొలిసారి ప్రసాద్స్‌లో చూశాను. నా పక్కన ఓ అమ్మాయి కూచుంది. నా మనసంతా ఆమె మీదే. సినిమా చూసి తను ఎలా ఫీలవుతోంది, అందరూ ఎలా రియాక్టవుతారు, మెచ్చుకుంటారా తిట్టుకుంటారా అంటూ టెన్షన్‌గా చూశాను. నా అదృష్టం... అందరికీ నేను నచ్చాను. సినిమా వైపు అడుగులు ఎలా పడ్డాయి? నేను ఎంబీయే (హెచ్.ఆర్.) ఫైనలియర్లో ప్రాజెక్టు కోసం మీడియాను ఎంచుకున్నాను. అప్పుడే చాలామంది నాతో అనేవారు... చక్కగా ఉన్నావు, మోడల్‌గా ట్రై చేయొచ్చుగా అని. నాక్కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనిపించింది. అంబికా దర్బార్ బత్తి, అపర్ణా కన్స్ట్రక్షన్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. కానీ పరీక్షలు దగ్గర్లో ఉండటంతో చదువు మీదే శ్రద్ధపెట్టాను. చదువు పూర్తయ్యాక సినిమా అంగీకరించాను. హీరోయిన్గా పిలుపు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు? ఇంద్రగంటి మోహనకృష్ణగారి నుంచి పిలుపు రావడం పెద్ద సర్ప్రయిజ్. ఫేస్బుక్లో నా ఫొటోలు చూసి కాల్ చేశారాయన. ఆయన డెరైక్ట్ చేసిన అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ తదితర చిత్రాలు చూశాను. అంత మంచి దర్శకుడితో పనిచేసే చాన్స్ రావడం సంతోషమే కదా! నటనలో అనుభవం లేదు కదా... కష్టమనిపించలేదా? మొదట్లో అనిపించేది. సీన్లు డిస్కస్ చేయడానికి కూడా భయమేసేది. సినిమా ప్రారంభించక ముందు ఆరు నెలల పాటు రిహార్సల్స్ జరిగాయి. షూటింగ్ మొదలయ్యాక కూడా స్క్రిప్టు ముందే ఇచ్చేసేవారు. దాంతో ఇంటి దగ్గర బాగా చదివి, హోమ్‌వర్క్ చేసేదాన్ని. ఏదైనా డౌట్ వస్తే అడిగి తెలుసుకునేదాన్ని. దాంతో తర్వాత ఈజీ అయిపోయింది. మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? సినిమా చూడగానే నాన్న నాకు ఫోన్ చేసి... ‘ఇంత బాగా చేస్తావనుకోలేదురా’ అన్నారు. చాలా సంతోషమేసింది. మొదట్లో మోడలింగ్ అంటేనే ఇష్టపడలేదాయన. అన్నీ వివరించాక ‘నీ ఇష్టం, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకో, ఏం చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యి’ అన్నారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యింది. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? సినిమా చూశాక కొందరు... ఇంకాస్త గ్లామరస్‌గా కనిపించి ఉంటే బాగుండేది అన్నారు. నాకు అర్థం కాలేదు. గ్లామరస్‌గా నటించడమంటే నేను అందంగా లేననా లేక స్కిన్‌షో చేయలేదనా? నాకిప్పటికీ అర్థం కాలేదు. తెలుగమ్మాయిలకు తెలుగులో ప్రోత్సాహం లేదు అని ప్రతిసారీ నిరూపితమవుతోంది. దానికి మీరేమంటారు? అది నిజమే. మన అమ్మాయిలంతా తమిళ సీమలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడెందుకు అవకాశాలు రావడం లేదు! ఎందుకంటే... తెలుగమ్మాయిలంటే సంప్రదాయబద్దంగానే ఉంటారని, అన్ని పాత్రలకూ సూట్ కారని దర్శకులు ముందే ఫిక్సయిపోతున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చి చూస్తే కదా... వాళ్లు సూటవుతారో లేదో తెలిసేది! దర్శకులను శాటిస్ఫై చేయడానికి మన అమ్మాయిలు కూడా ఏమైనా మారాలంటారా? అవసరం లేదు. మనవాళ్లకి ఏం తక్కువ! నేను చాలా ఆడిషన్స్‌కి వెళ్లాను. నేను తెలుగమ్మాయినని తెలిసి చాలామంది షాక్ తిన్నారు. ఎందుకంటే అంత మోడ్రన్‌గా ఉంటాను నేను. ‘మా పాత్రకు ఇలా కావాలి’ అంటే అలా ఒదిగిపోయే టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలు బోలెడంతమంది ఉన్నారు. అవకాశం ఇవ్వడమే కావాలి. మీ రెండో సినిమా ఎప్పుడు వస్తుంది? మొదటి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఆ పాత్రలకు నేను సూటవనేమో అనిపించి నో అన్నాను. పూర్తిస్థాయి పాత్ర కావాలని కాదు. నిడివి తక్కువైనా మంచిది, పేరు తెచ్చేది అయితే ఓకే చేయడానికి నేను సిద్ధం. అలాంటి చాన్స్ కోసమే ఎదురు చూశాను. ఇప్పుడు రమేష్‌వర్మ డెరైక్షన్‌లో చేస్తున్నాను. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. సెమీ వెస్టర్న్ క్యారెక్టర్. మంచి పేరు వస్తుందని అనుకుంటున్నా! - సమీర నేలపూడి -
దాములాంటి నిర్మాతలు ఇంకా రావాలి - నందినీరెడ్డి
‘‘స్టార్స్‌ను కాకుండా కథను నమ్మి సినిమాలు తీసే అతి తక్కువ మంది నిర్మాతల్లో దాము ఒకరు. ఇలాంటి నిర్మాతలు మరికొందరు వస్తే ఇంకా కొత్త కథలు, కొత్త దర్శకులు పరిశ్రమకు వస్తారు’’ అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. సుమంత్ అశ్విన్, ఈషా జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు... ఆ తరువాత’ యాభై రోజుల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఒక మిత్రునిలాగా ఈ సినిమా విషయంలో సహకరించారని దర్శకుడు పేర్కొన్నారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో పెద్ద హిట్టు కొట్టినందుకు సునీల్ సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా రమేష్‌ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, మారుతి, స్వాతి, బి.గోపాల్, వీఎన్ ఆదిత్య, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.