నవ్వులే నవ్వులు | Adivi sesh avasarala srinivas eesha Adhita myanikal movie started | Sakshi
Sakshi News home page

నవ్వులే నవ్వులు

Published Wed, Feb 1 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

నవ్వులే నవ్వులు

నవ్వులే నవ్వులు

వైవిధ్యమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దిట్ట. ‘క్షణం’తో సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్నారు అడివి శేష్‌. ‘అష్టా చమ్మా’ ద్వారా నటుడిగా పరిచయమై, ‘ఊహలు గుసగుసలాడే’తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని కూడా నిరూపించుకున్నారు. సక్సెస్‌లో ఉన్న ఇంద్రగంటి–శేష్‌–అవసరాల కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈష, అదితీ మ్యానికల్‌ ముఖ్య పాత్రల్లో ‘ఎ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్ ’ పతాకంపై ఇంద్రగంటి దర్శకత్వంలో కె.సి. నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సీనియర్‌ ప్రొడ్యూసర్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు.

నటుడు తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నేటి నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తు్తన్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్‌ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement