దాములాంటి నిర్మాతలు ఇంకా రావాలి - నందినీరెడ్డి
‘‘స్టార్స్‌ను కాకుండా కథను నమ్మి సినిమాలు తీసే అతి తక్కువ మంది నిర్మాతల్లో దాము ఒకరు. ఇలాంటి నిర్మాతలు మరికొందరు వస్తే ఇంకా కొత్త కథలు, కొత్త దర్శకులు పరిశ్రమకు వస్తారు’’ అని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు.
సుమంత్ అశ్విన్, ఈషా జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు... ఆ తరువాత’ యాభై రోజుల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ఒక మిత్రునిలాగా ఈ సినిమా విషయంలో సహకరించారని దర్శకుడు పేర్కొన్నారు.
సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో పెద్ద హిట్టు కొట్టినందుకు సునీల్ సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంకా రమేష్‌ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, మారుతి, స్వాతి, బి.గోపాల్, వీఎన్ ఆదిత్య, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.