Actress Poorna Warns People About Fraud By Using Her Husband Name, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Poorna : 'మీరు మోసపోతే , దానికి నా భర్త కారణం కాదు'.. నటి పూర్ణ వార్నింగ్‌

Published Thu, Nov 10 2022 11:46 AM | Last Updated on Thu, Nov 10 2022 1:15 PM

Actress Poorna Warns People About Fraud By Using Her Husband Name - Sakshi

హీరోయిన్‌ పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన  షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టిన పూర్ణ ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అటు పర్సనల్‌ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్‌ లైఫ్‌నూ బ్యాలెన్స్‌ చేస్తున్న పూర్ణ ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. వాళ్ల ప్రొఫైల్‌తో సామాన్యుల దగ్గర్నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి నటి పూర్ణకు సైతం ఎదురైంది.

తన భర్త షానిద్‌ ఆసిఫ్‌ ఫోటోను వాట్సాప్‌ డీపీగా క్రియేట్‌ చేసి ఓ నంబర్‌ నుంచి కొందరు లావాదేవీలు జరుపుతున్నారని పూర్ణ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పూర్ణ.. అది తన భర్త నెంబర్‌ కాదని, ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement