సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్, హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగిన కేటుగాళ్లు.. ఓ గృహిణి నుండి రూ.40 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 40 ఏళ్ల గృహిణికి ఫెడెక్స్ కొరియర్ పేరిట కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆమె ఆధార్ నెంబర్‌తో ఎండి.ఎం.ఏ డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు.
అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి, అతనికి ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయని భయపెట్టారు. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేసి, వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ.40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment