ముంబై: సైబర్‌సెక్యూరిటీ రిస్కులను సమర్ధమంతంగా ఎదుర్కొనేలా, డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మార్చేలా అధీకృత నాన్-బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు (పీఎస్‌వో) రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ముసాయిదాను ప్రకటించింది. సైబర్‌సెక్యూరిటీ రిస్కులను గుర్తించడం, మదింపు చేయడం, సమీక్షించడం, ఎదుర్కొనడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది.
ఇదీ చదవండి: రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్
డిజిటల్ పేమెంట్ లావాదేవీలను సురక్షితంగా చేసేందుకు తీసుకోతగిన భద్రతాపరమైన చర్యలను సూచించింది. సమాచార భద్రతపరంగా రిస్కులు తలెత్తకుండా పీఎస్‌వో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బోర్డు) బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదాలో ప్రతిపాదించింది. దీని ప్రకారం సైబర్ దాడులను గుర్తించి, స్పందించి, కట్టడి చేసి, రికవర్ చేసేందుకు పీఎస్‌వోలు .. సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళిక (సీసీఎంపీ)ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. (10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?)
తమ సంస్థలో కీలక హోదాల్లో ఉన్న వారు, అసెట్లు, ప్రక్రియలు, కీలకమైన కార్యకలాపాలు, థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లు మొదలైన వివరాలను రికార్డు రూపంలో ఉంచాలి. డేటా భద్రతకు సంబంధించి సమగ్రమైన డేటా చోరీ నివారణ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ వర్గాలు ఈ ముసాయిదాపై జూన్ 30లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.
మరిన్ని ముఖ్యమైన వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment