యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాలెట్ పరిమితిని రూ. 5,000కు, ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 1,000కి పెంచింది. ఇందుకు సంబంధించి 2022 జనవరిలో జారీ చేసిన ’ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్’ను సవరించింది.
ప్రస్తుతం ఈ విధానంలో ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 500గా, మొత్తం వాలెట్ లిమిట్ రూ. 2,000గా ఉంది. గత అక్టోబర్‌లో ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా ఈ పరిమితులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా అందుబాటులో లేని పరిస్థితుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేయగలిగే సాంకేతికతలను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
యూపీఐ పిన్‌ని ఉపయోగించకుండా తక్కువ-విలువ లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను యూపీఐ లైట్ అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లపై ఆధారపడకుండా కస్టమర్-ఫ్రెండ్లీ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి, వ్యాపారులకు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment