సాక్షి, బెంగళూరు : ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని మహిళతో స్నేహం చేసిన వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. నగ్నంగా ఉన్న వీడియో దృశ్యాలను సేకరించిన ఆమె డబ్బుకోసం బ్లాక్‌మెయిల్ కు పాల్పడింది. బెంగళూరు సుల్తాన్‌పాళ్య కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఇతని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా కొద్దిరోజుల క్రితం 30 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్‌నంబర్లు మార్చుకున్నారు. నిత్యం చాటింగ్ చేసేవారు. ఈ నెల 19 తేదీన ఉదయం 11 గంటలకు ఆమె వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ నీవు అలాగే కనిపించాలని కోరగా అలాగే చేశాడు. ఆమె దృశ్యాలను రికార్డు చేసుకుని కొద్దిసేపటి తరువాత మళ్లీ ఫోన్ చేసిందామె. నీ ప్రైవేట్ దృశ్యాలు నా వద్ద ఉన్నాయి. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో భయపడిన వ్యక్తి ఆమె చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ.10 వేలు జమచేశాడు. డబ్బులు ఇవ్వాలని పదేపదే బెదిరించడంతో భాదితుడు ఉత్తరవిభాగం సైబర్‌క్రైంపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఎస్‌బీఐ కస్టమర్లే టార్గెట్
దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో నివసిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లునే సైబర్ వంచకులు టార్గెట్ చేస్తున్నారు. కూలి కార్మికులు, రైతులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కన్నం వేయడానికి సైబర్ వంచకులు వల వేస్తున్నారు. ప్రజలు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం పోలీసులు సలహా ఇచ్చారు.
కరోనా టెస్టులంటూసైబర్ మోసాలు
ప్రస్తుతం కోవిడ్–19 ఉచిత పరీక్షల పేరుతో అమాయక ప్రజలను వంచిస్తున్నారు. సైబర్ వంచకులు కేంద్రప్రభుత్వం పేరుతో ఉచిత కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తామని ఇ–మెయిల్, మొబైల్స్ కు మెసేజ్ పంపుతున్నారు. లింక్‌పంపించి దానిపై క్లిక్ చేసి మీ అడ్రస్ పేరుతో పాటు పూర్తివివరాలు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ భర్తీ చేయాలని సూచిస్తారు. ఒకవేళ లింక్ పై క్లిక్ చేసి తెలిపిన వివరాలు చేస్తే చాలు. మీ బ్యాంక్ లేదా వాలెట్‌లో ఉన్న నగదు మీకు తెలియకుండా వారి అకౌంట్లుకు జమచేసుకుంటారు. ఇలాంటి మెసేజ్‌లు చాలామందికి ఇ–మెయిల్, మొబైల్ కు అందుతుండటంతో దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ సమాచారం ఎవరికి తెలపరాదని సైబర్ పోలీసులు మనవిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment