blackmailed
-
మూడు పేర్లతో వేధించిన యువతి అరెస్ట్
రాయపర్తి: ఒకే అమ్మాయి మూడు పేర్లతో వ్యవహరించి యువకుడి ఆత్మహత్యకు కారణ మైంది. ఆ యువతిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మైలపాక సందీప్‌కుమార్(23)కు దుగ్గొండి మండలం లక్ష్మిపురానికి చెందిన ఓ యువతి ఫోన్ ద్వారా పరిచయమైంది. ఈ క్రమంలో సందీప్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పి అతడికి ప్రియురాలిగా వ్యవహరించింది. ఇదేసమయంలో అదే యువతి స్రవంతి, కావ్య, మనీషా పేర్లతో వేరే నంబర్ల ద్వారా సందీప్‌తో మాట్లాడి ప్రేమ పేరుతో వల వేసింది. అతడు కూడా ప్రేమగా మాట్లాడటంతో ఆ యువతి సందీప్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు ఈనెల 12న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి ఫోన్ కాల్స్ పరిశీలించిన అనంతరం..ఈనెల 18న అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో ఆ యువతిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
పదిలో రెండుసార్లు ఫెయిల్.. హ్యాకింగ్ పాఠాలు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్‌లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. హ్యాకింగ్‌లో శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్ ఫోన్ నెంబర్‌తో ఓ వాట్సాప్ సృష్టించాడు. అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్ చేసేవాడు. అదే సమయంలో వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి తెలిపారు. -
పెన్ డ్రైవ్‌లో ప్రైవేట్ ఫోటోలు.. 5లక్షలు ఇవ్వాలంటూ
తమ ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్లో బంధించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం లవర్స్ అలా చేస్తుంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటననే నిదర్శనం. ఓ ప్రేమ జంట తమ జ్ఞాపకార్థం ప్రైవేట్ ఫోటోలు దిగి పెన్ డ్రైవ్‌లో బంధించుకుంది. అది కాస్త మరో వ్యక్తి చేతిలో పడింది. దీంతో అతడు ఆ లవర్స్‌కు ఫోన్ చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వారిని బ్లాక్మెయిల్ చేశాడు. అతని వేధింపులు తాళలేక ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కి చెందిన ఓ లా స్టూడెంట్(21),ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఇటీవల తమ సహచర లా స్టూడెంట్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో మథుర హైవే పక్కనున్న ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆగారు. ఆ సమయంలో తమ లగేజీని ఓ టేబుల్ పక్కన పెట్టారు. తిరుగు ప్రయాణంలో బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ అక్కడే పడిపోయింది. అది ఓ వ్యక్తికి దొరికింది. అందులో లవర్స్ ప్రైవేట్ ఫోటోలు ఉండటంతో వారిని బ్లాక్ మెయిల్ చేయాలని భావించాడు. ఫొటోల స్క్రీన్‌షాట్‌పై యువతి మొబైల్ నంబర్ ఉండగా ఈ నెల 15న తొలుత ఆమెకు ఫోన్ చేసి రూ.5 లక్షల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. ఆ యువతిని బెదిరించి ప్రియుడి మొబైల్ నంబర్ సేకరించాడు. అతడికి కూడా ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. రోజు రోజుకి అతని వేధింపులు ఎక్కువ అవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ జంట ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీ తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
నగ్న వీడియోలు: అబ్బాయికి అమ్మాయి బ్లాక్మెయిల్
సాక్షి, బెంగళూరు : ఫేస్బుక్లో గుర్తుతెలియని మహిళతో స్నేహం చేసిన వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. నగ్నంగా ఉన్న వీడియో దృశ్యాలను సేకరించిన ఆమె డబ్బుకోసం బ్లాక్మెయిల్ కు పాల్పడింది. బెంగళూరు సుల్తాన్‌పాళ్య కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఇతని ఫేస్బుక్ ఖాతా ద్వారా కొద్దిరోజుల క్రితం 30 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్‌నంబర్లు మార్చుకున్నారు. నిత్యం చాటింగ్ చేసేవారు. ఈ నెల 19 తేదీన ఉదయం 11 గంటలకు ఆమె వీడియో కాల్ చేసి నగ్నంగా కనిపిస్తూ నీవు అలాగే కనిపించాలని కోరగా అలాగే చేశాడు. ఆమె దృశ్యాలను రికార్డు చేసుకుని కొద్దిసేపటి తరువాత మళ్లీ ఫోన్ చేసిందామె. నీ ప్రైవేట్ దృశ్యాలు నా వద్ద ఉన్నాయి. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో భయపడిన వ్యక్తి ఆమె చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ.10 వేలు జమచేశాడు. డబ్బులు ఇవ్వాలని పదేపదే బెదిరించడంతో భాదితుడు ఉత్తరవిభాగం సైబర్‌క్రైంపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్బీఐ కస్టమర్లే టార్గెట్ దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో నివసిస్తున్న ఎస్బీఐ కస్టమర్లునే సైబర్ వంచకులు టార్గెట్ చేస్తున్నారు. కూలి కార్మికులు, రైతులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం కన్నం వేయడానికి సైబర్ వంచకులు వల వేస్తున్నారు. ప్రజలు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం పోలీసులు సలహా ఇచ్చారు. కరోనా టెస్టులంటూసైబర్ మోసాలు ప్రస్తుతం కోవిడ్–19 ఉచిత పరీక్షల పేరుతో అమాయక ప్రజలను వంచిస్తున్నారు. సైబర్ వంచకులు కేంద్రప్రభుత్వం పేరుతో ఉచిత కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తామని ఇ–మెయిల్, మొబైల్స్ కు మెసేజ్ పంపుతున్నారు. లింక్‌పంపించి దానిపై క్లిక్ చేసి మీ అడ్రస్ పేరుతో పాటు పూర్తివివరాలు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ భర్తీ చేయాలని సూచిస్తారు. ఒకవేళ లింక్ పై క్లిక్ చేసి తెలిపిన వివరాలు చేస్తే చాలు. మీ బ్యాంక్ లేదా వాలెట్లో ఉన్న నగదు మీకు తెలియకుండా వారి అకౌంట్లుకు జమచేసుకుంటారు. ఇలాంటి మెసేజ్‌లు చాలామందికి ఇ–మెయిల్, మొబైల్ కు అందుతుండటంతో దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ సమాచారం ఎవరికి తెలపరాదని సైబర్ పోలీసులు మనవిచేశారు. -
డబ్బు కోసం ఏకంగా భార్యనే..
సాక్షి, హైదరాబాద్: భార్యను బ్లాక్మెయిల్ చేసి ఓ భర్త ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో శుక్రవారం వెలుగుచూసింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భార్యను భర్త సంతోష్ వేధింపులకు గురిచేశాడు. మిత్రుడి పేరుతో ఆమెకు మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.కోటి వసూలు చేశాడు. అయితే, భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంతోష్ ఘనకార్యం బయటపడింది. (చదవండి: కరోనా నివారణ మందు పేరుతో టోకరా) ఇక సైబరాబాద్ మహిళా పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భార్యను మోసం చేసిన సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు. గతంలో కూడా కొంతమంది మహిళలను సంతోష్ వేధించినట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్య చివరకు భార్యను సైతం వేధించాడని చెప్పారు. సంతోష్‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. (చదవండి: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) -
ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో తీసిన విద్యార్థి
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్తో ప్రొఫెసర్ స్నేహంగా మెలిగారు. గత 19వ తేదీ వివేశ్ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని తెలిపి ప్రొఫెసర్‌ను పిలిచాడు. ఇందుకు ప్రొఫెసర్ సమ్మతించింది. రాత్రి ఏడు గంటల సమయంలో షోలింగ నల్లూర్‌లో ప్రొఫెసర్ ఉంటున్న మహిళా హాస్టల్‌కు వివేశ్ వెళ్లాడు. అనంతరం ఆమెను తన బైకులో ఎక్కించుకుని ఈస్ట్ కోస్ట్ రోడ్డుకు వెళ్లాడు. పూంజేరి సమీపాన గల చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఆపాడు. దీంతో భీతి చెందిన ప్రొఫెసర్ ఎందుకు ఇక్కడ ఆపావని ప్రశ్నించగా లోపల రిసార్ట్ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తర్వాత పొదలు ఉన్న చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి, దుస్తులు విప్పమని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. ఈ విషయం బయట చెప్పకూడదని బెదిరించి మళ్లీ ఆమెను హాస్టల్లో దింపివేశాడు. తర్వాత తనతో గడపాలని, లేకుంటే నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సెమ్మంజేరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివేశ్ను అరెస్టు చేసి ప్రొఫెసర్ నగ్న వీడియోను డిలీట్ చేశారు. అతన్ని సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
సీనియర్ నటుడి వికృత పర్వం
ముంబై: సీనియర్ నటుడు ఆదిత్య పంచోలిపై ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటి దిగ్బ్రాంతికర విషయాలు వెల్లడించారు. పంచోలి తనపై సాగించిన దారుణాలను వెర్సోవా పోలీసులకు ఇచ్చిన రెండున్నర పేజీల వాంగ్మూలంలో వివరించారు. అతడి ఆగడాలపై 2004-06లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తన సోదరిని కూడా చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు. ‘బాలీవుడ్లో రాణించాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టిన నాకు ఆ ఏడాది ఆదిత్య పంచోలి పరిచయమయ్యాడు. అప్పటికి అతడికి వయసు 38 ఏళ్లు. నా కంటే 22 ఏళ్లు పెద్దవాడు. అతడికి పెళ్లైపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడి కూతురిది నా వయసే. 2004లో ఓరోజు అతడితో కలిసి పార్టీకి వెళ్లాను. పార్టీలో డ్రింక్ తాగిన తర్వాత మత్తుగా అనిపించింది. అందులో ఏదో కలిపారన్న అనుమానం కలిగింది. పార్టీ ముగిసిన తర్వాత నన్ను హాస్టల్ దగ్గర దిగబెడతానని అడగడంతో అతడి రేంజ్ రోవర్ కారులో ఎక్కాను. కొంత దూరం వెళ్లాక యారీ ప్రాంతంలో కారు ఆపేసి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దురాగతాన్ని ఫొటోలు తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనకు భార్యలా ఉండాలని ఒత్తిడి చేసేవాడు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివని, నా వయసుకు తగినవాడిని పెళ్లి చేసుకుంటానని బతిమాలినా కరగలేదు. ఫొటోలు బయటపెడతానని భయపెట్టేవాడు. అప్పుడు నేను చిన్నదాన్ని. ముంబైలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. పంచోలి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఆటోను మధ్యలో ఆపేసి విచక్షణారహితంగా కొట్టాడు. బిపిన్ బిహారి అనే సీనియర్ పోలీసు అధికారిని కలిసి నా గోడు చెప్పుకున్నాను. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు 2004-05లో మా ఆంటీతో కలిసి పల్లవి అపార్ట్‌మెంట్‌కు మారిపోయాను. తన స్నేహితులతో కలిసి అక్కడికీ వచ్చి రభస చేశాడు. ప్రతిసారి తనతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చేవాడు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. 2006-07లో వెర్సోవాలో అపార్ట్మెంట్ కొనుక్కుని ఒంటరి జీవితం గడుపుతుండగా అక్కడికీ వచ్చాడు. పీకలదాకా తాగి నకిలీ తాళంతో నా ఇంట్లోకి చొరబడి వస్తువులన్నింటిని ధ్వంసం చేసి నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. అతడి పెట్టే బాధలు తట్టుకోలేక 2008-09లో బాంద్రాకు మారిపోయాను. అక్కడికీ ప్రతక్షమయ్యాడు. ఆరోగ్యం బాలేక నా దగ్గర ఉండేందుకు వచ్చిన మా సోదరిపై చేయి చేసుకున్నాడు. ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావని ఫోన్ చేసి అడిగితే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ. 50 లక్షలు ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు శాంతించాడు. నాకు అవకాశాలు పెరిగి గుర్తింపు రావడంతో మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టాడు. తనదగ్గరున్న ఫొటోలు మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు పంపుతానని బెదిరింపులకు దిగాడ’ని బాధితురాలు వివరించారు. బాధితురాలి సోదరి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆదిత్య పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుస్తు బెయిల్ కోసం కోర్టును అతడు ఆశ్రయించగా జూలై 19 వరకు అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం ఆదేశాల్చింది. ప్రతి బుధ, శనివారాల్లో వెర్సోవా పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. కాగా, తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదని ఆదిత్య పంచోలి చెప్పారు. -
రేప్ చేసి, వీడియోలు బయటపెడతానని..
కోల్‌కతా: ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్‌కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు. దాదాపు ఏడాదిపాటు లైంగికి దాడికి పాల్పడ్డాడు. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. క్రమంగా అతడి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన 30 ఏళ్ల మహిళ కోల్‌కతాలో ఉండి చదువుకుంటోంది. తన స్నేహితురాళ్లతో కలిసి జోద్పూర్ గార్డెన్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. ఆ పార్టీలోనే రాకేశ్ చౌదరీ, ఆయన భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకసారి పార్టీకి రావాలంటూ ఆహ్వానించిన రాకేశ్ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్‌కతాలోని బైపాస్ రోడ్డులో ఉన్న తన గెస్ట్‌హౌజ్‌కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. -
రేప్ కేసులో టీవీ నటుడి అరెస్ట్
సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి...మహిళపై అత్యాచారం చేసి, బెదిరింపులకు పాల్పడ్డ ఓ బుల్లితెర నటుడిని కర్ణాటక పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో యాక్టర్ గా గుర్తింపు పొందిన ఇరవై మూడేళ్ళ సౌరభ్ సాయి సర్జీత్... స్టేజ్ షోలో పరిచయమైన మహిళకు సీరియల్స్‌లో ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఉచ్చులోకి దింపి, చివరికి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన ఓ మహిళకు గతేడాది ఓ రియాల్టీ షోలో సౌరభ్ పరిచయం అయ్యాడు. హిందీ టీవీ సీరియల్స్‌లో పాత్రలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు... గతేడాది బెంగుళూరుకు వచ్చిన సౌరభ్‌కు తన భర్తకు కూడా పరిచయం చేసింది. మైసూర్ రోడ్డులో ఉన్న బాధితురాలి ఇంటికి వచ్చిన సౌరభ్.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమెకు ఫ్రూట్ జ్యూస్ ఆఫర్ చేశాడు. అది మహిళలు తాగే డ్రింక్ అని నమ్మించాడు. దాంతో జ్యూస్ తాగిన ఆమె స్పృహ కోల్పోయింది. అదే అదనుగా సౌరభ్ ఆమెపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ మహిళను డబ్బు.. సెక్స్ కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఇటీవల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళిన సౌరభ్... బాధితురాలిని తాను ఉంటున్నహోటల్కు పిలిపించుకున్నాడు. అతడికి కావలసినట్లుగా ఉండాలంటూ బలవంతం చేశాడు. అంతకు మహిళ నిరాకరించటంతో తాను చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా ఆమె భర్తకు కూడా పంపిస్తానంటూ భయపెట్టాడు. అంతేకాకుండా సౌరభ్ ... ఆమెను బెదిరించి సుమారుగా 15 లక్షల రూపాయలను వసూలు చేశాడు. అంతటితో వదిలిపెట్టకుండా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కూడా అమ్మి ముంబయిలోని తనుండే ఫ్లాట్‌కు అద్దె కట్టమని డిమాండ్ చేశాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైంది. చివరకు ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది. సౌరభ్ తన ఇంటికి వస్తున్న విషయాన్ని బాధితురాలు భయంతో.. ఆమె భర్తకు చెప్పలేకపోయిందని, అతడి నుంచీ తప్పించుకోవడం కోసం ఆ మహిళ ఉడిపి జిల్లాలోని తన స్వంత ఊరికి వెళ్ళడం మొదలు పెట్టిందని పోలీసులు తెలిపారు.. నిందితుడి చేతిలో ఆమె తీవ్ర హింసకు గురైందని, సౌరభ్ తీసిన వీడియోలన్నీతాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే బాధితురాలు ఆభరణాలు అమ్మిన షాపు నుంచీ కూడా వివరాలు సేకరించిన బెంగుళూరు పోలీసులు.. కేసులో మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అసభ్యకర వీడియోతో బ్లాక్ మెయిలింగ్: పోలీసులకు మహిళ ఫిర్యాదు
ఫరిదాబాద్: ఓ మహిళను బలవంతంగా అనుభవించబమే కాకుండా, ఆ సన్నివేశాలను వీడియోలో బంధించి ఓ యువకుడు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు సంవత్సరాల కూతురితో న్యూ రంజిత్ నగర్ లో ఒంటరిగా ఉంటున్న మహిళకు గోపీచంద్ అనే వ్యక్తి పరిచయమైయ్యాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడంతో ఆ మహిళ చత్తర్‌పూర్‌లోని ఓ ఫాంహౌస్‌లో పని చేస్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తనతో చనువుగా ఉండటం మొదలు పెట్టిన గోపీచంద్ పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు. అతనికి అప్పటికే పెళ్లి కావడంతో తాను వ్యతిరేకించినట్లు ఆ మహిళ పేర్కొంది. కాగా, ఓ హోటల్ లో జరిగిన పార్టీలో కూల్‌డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి తనను బలవంతంగా అనుభవించాడని, అప్పడు తీసిన వీడియో చూసి తరుచు వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నడని పేర్కొంది.ఆ మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.