సాక్షి, హైదరాబాద్: భార్యను బ్లాక్‌మెయిల్ చేసి ఓ భర్త ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో శుక్రవారం వెలుగుచూసింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భార్యను భర్త సంతోష్ వేధింపులకు గురిచేశాడు. మిత్రుడి పేరుతో ఆమెకు మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.కోటి వసూలు చేశాడు. అయితే, భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంతోష్ ఘనకార్యం బయటపడింది.
(చదవండి: కరోనా నివారణ మందు పేరుతో టోకరా)
ఇక సైబరాబాద్ మహిళా పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భార్యను మోసం చేసిన సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు. గతంలో కూడా కొంతమంది మహిళలను సంతోష్ వేధించినట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్య చివరకు భార్యను సైతం వేధించాడని చెప్పారు. సంతోష్‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
(చదవండి: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు)
Comments
Please login to add a commentAdd a comment