gacchibowli
-
Hyderabad: గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
హ్యుమానిటీస్‌లో హెచ్‌సీయూ టాప్
రాయదుర్గం(హైదరాబాద్): రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(ఆర్‌యూఆర్)–2020లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సత్తా చాటింది. హ్యుమానిటీస్ విభాగంలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 276వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు హెచ్‌సీ యూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లారివేట్ అనలైటిక్స్ భాగస్వామ్యంతో ఆర్‌యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ.. ఆర్‌యూఆర్–2020 హ్యుమానిటీస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక సస్టైనబిలిటీ వంటి అంశాలతోపాటు 20 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలో 800 పైగా విద్యా సంస్థలు ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ప్రపంచంలో హ్యుమానిటీస్ బోధనపరంగా హెచ్‌సీయూ 53వ స్థానం సాధించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. -
ప్రభుత్వం విప్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా మిషన్ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. -
డబ్బు కోసం ఏకంగా భార్యనే..
సాక్షి, హైదరాబాద్: భార్యను బ్లాక్మెయిల్ చేసి ఓ భర్త ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో శుక్రవారం వెలుగుచూసింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భార్యను భర్త సంతోష్ వేధింపులకు గురిచేశాడు. మిత్రుడి పేరుతో ఆమెకు మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.కోటి వసూలు చేశాడు. అయితే, భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంతోష్ ఘనకార్యం బయటపడింది. (చదవండి: కరోనా నివారణ మందు పేరుతో టోకరా) ఇక సైబరాబాద్ మహిళా పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భార్యను మోసం చేసిన సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు. గతంలో కూడా కొంతమంది మహిళలను సంతోష్ వేధించినట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్య చివరకు భార్యను సైతం వేధించాడని చెప్పారు. సంతోష్‌కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. (చదవండి: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) -
కొండాపూర్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం!
సాక్షి, హైదరాబాద్: మిసెస్ మామ్ రెండో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్లో మంగళవారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్ స్పోర్ట్స్‌లో డిసెంబర్ 8న సాయంత్రం గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్ స్మైల్, మిసెస్ ఫ్యాషనిస్టా, మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బ్యూటీఫుల్ హెయిర్, మిసెస్ ఫిట్నెస్ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్ చేసి డిసెంబర్ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్లో చిట్కాలు, డెంటల్, హెల్త్ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియజేయడమేగాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్ మామ్ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమా ఆర్య, మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా.. విషాదం
-
‘కేటీఆర్ బామ్మర్ది బ్రోకర్ పని చేస్తున్నాడా’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ బంధువులు బ్రోకర్ అవతారమెత్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వారికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ దన్నుగా నిలుస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రేవంత్ శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ బామ్మర్దికి చెందిన ‘ఈవెంట్స్ నౌ’ అనే సంస్థ యువతులతో వ్యాపారం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. మ్యూజిక్ నైట్స్ పేరుతో బ్రోకర్ పనులు చేస్తున్నారని విమర్శించారు. మేమే అడ్డుకుంటాం.. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ‘సెస్సేషన్ ఈవెంట్’ నిర్వహించే మ్యూజికల్ నైట్ పార్టీపై ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. లేదంటే, ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా గచ్చిబౌలి వెళ్లి సెన్సేషన్ ఈవెంట్‌ను అడ్డుకుంటాని అన్నారు. అయినా, గోవా, ముంబయ్, పుణెల్లో నిషేదించిన మ్యూజికల్ నైట్స్‌కు హైదరాబాద్‌లో ఎలా అనుమతిస్తారని అన్నారు. డీలర్ల కోసమే.. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డేటింగ్ క్లబ్ నిర్వహిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. లేకుంటే పోలీసు పహరాలో మ్యూజికల్ నైట్స్ నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ అమ్మకానికి, డీలర్లను ఏర్పాటు చేసుకోవటానికే ఇలాంటి పార్టీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఒక్కక్కరి దగ్గర లక్ష నుంచి 5 లక్షల వసూలు చేస్తున్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చని అన్నారు. కేటీఆర్ బంధువులైన మాదాపూర్ డీసీపీ, ఏసీపీ ఈ ఈవెంట్‌కు పహారా కాస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఇలాంటి నీచమైన పనులు చేస్తోంటే రాష్ట్రం ఏమైపోతుందని అన్నారు. అందుకే విచారణ ఆపేశారు. గతేడాది హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన బార్లు, పబ్‌లలో మాదక ద్రవ్యాల అమ్మకాలపై హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని రేవంత్ ప్రశ్నించారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలో పలువురు ప్రముఖులను విచారించిన వివేదికలు బయటపెట్టాని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ముఠాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువర్గం కూడా ఉండడంతో మాదక ద్రవ్యాల ఉదంతంపై విచారణ పక్కన పెట్టారని అన్నారు. -
ప్రారంభమైన కాసేపటికే... సన్‌బర్న్ పార్టీలో వెపన్ కలకలం..
-
ప్రారంభమైన కాసేపటికే... సన్‌బర్న్ పార్టీలో వెపన్ కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతున్న ఈ పార్టీకి యువత పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 17 ఏళ్ల లోపు బాలలను ఈ పార్టీకి అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసుల నిఘా నడుమ పార్టీ కొనసాగుతోంది. అయితే, సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైన కాసేపటికే కలకలం రేగింది. ఓ యువకుడు ఆయుధంతో సన్‌బర్న్ పార్టీ వేదిక వద్ద దొరికిపోయాడు. ఓ వ్యక్తి తుపాకీతో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రవేశద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ‘సన్‌బర్న్’ వద్ద మైనర్లు.. సన్ బర్న్ ఈవెంట్ వద్ద మైనర్లకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. హైకోర్టు తీర్పు మేరకు మైనర్లను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొందరు మైనర్లు ఆందోళన చేపట్టారు. అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు ముందుగా టిక్కెట్లు విక్రయించారని అధికారులను నిలదీస్తున్నారు. వారికి వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. హైకోర్టు ఆదేశాలు.. సన్‌బర్న్ పార్టీకి హైకోర్టు మధ్యాహ్నం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సన్‌బర్న్ పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ , లాండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ 30 కి వాయిదా వేసింది. నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం సరఫరా చేసే కార్యక్రమానికి మైనర్లను అనుమతించడం చట్ట విరుద్ధమన్నారు. స్టేడియం వద్ద భారీగా బందోబస్తు గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సన్‌బర్న్ ఈవెంట్ షో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ షోను అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంత్ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ షోకు అనుమతినివ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంను తాగి ఊగడానికి ఇస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. -
వైట్అండ్వైట్ సూపర్‌హిట్