గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం! | Competitions For Pregnant Women In The Name Of Mrs Mom | Sakshi

గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం!

Nov 20 2019 1:21 PM | Updated on Nov 20 2019 1:21 PM

Competitions For Pregnant Women In The Name Of Mrs Mom - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ శిల్పిరెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: మిసెస్‌ మామ్‌ రెండో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే డిసెంబర్‌ 8న నిర్వహించనున్నట్లు డాక్టర్‌ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో మంగళవారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్‌ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్‌ స్పోర్ట్స్‌లో డిసెంబర్‌ 8న సాయంత్రం గ్రాండ్‌  ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్‌ స్మైల్, మిసెస్‌ ఫ్యాషనిస్టా, మిసెస్‌ బ్రెయిన్స్, మిసెస్‌ బ్యూటీఫుల్‌ హెయిర్, మిసెస్‌ ఫిట్‌నెస్‌ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు.

విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్‌ చేసి డిసెంబర్‌ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్‌లో చిట్కాలు, డెంటల్, హెల్త్‌ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియజేయడమేగాక సాధారణ ప్రసవం కోసం వారిని   సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్‌ మామ్‌ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ నీలిమా ఆర్య,  మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement