
రాయదుర్గం(హైదరాబాద్): రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్(ఆర్‌యూఆర్)–2020లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సత్తా చాటింది. హ్యుమానిటీస్ విభాగంలో దేశంలో మొదటి స్థానం, ప్రపంచంలో 276వ స్థానాన్ని సాధించింది. ఈ మేరకు హెచ్‌సీ యూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్లారివేట్ అనలైటిక్స్ భాగస్వామ్యంతో ఆర్‌యూఆర్ ర్యాంకింగ్స్ ఏజెన్సీ.. ఆర్‌యూఆర్–2020 హ్యుమానిటీస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది.
బోధన, పరిశోధన, అంతర్జాతీయ వైవిధ్యం, ఆర్థిక సస్టైనబిలిటీ వంటి అంశాలతోపాటు 20 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలో 800 పైగా విద్యా సంస్థలు ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి. ప్రపంచంలో హ్యుమానిటీస్ బోధనపరంగా హెచ్‌సీయూ 53వ స్థానం సాధించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment