రేప్ కేసులో టీవీ నటుడి అరెస్ట్ | In a rape case actor Sourabh arrest | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో టీవీ నటుడి అరెస్ట్

Published Fri, Sep 25 2015 8:16 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

రేప్ కేసులో టీవీ నటుడి అరెస్ట్ - Sakshi

రేప్ కేసులో టీవీ నటుడి అరెస్ట్

సీరియల్స్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి...మహిళపై అత్యాచారం చేసి, బెదిరింపులకు పాల్పడ్డ ఓ బుల్లితెర నటుడిని కర్ణాటక పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే హిందీ టెలివిజన్ సీరియల్స్లో యాక్టర్ గా గుర్తింపు పొందిన ఇరవై మూడేళ్ళ సౌరభ్ సాయి సర్జీత్...  స్టేజ్ షోలో పరిచయమైన మహిళకు సీరియల్స్లో ఛాన్స్లు ఇప్పిస్తానంటూ  ఉచ్చులోకి దింపి, చివరికి బ్లాక్ మెయిల్ చేసి  పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డాడు.  

కర్ణాటకకు చెందిన ఓ మహిళకు గతేడాది ఓ రియాల్టీ షోలో సౌరభ్ పరిచయం అయ్యాడు. హిందీ టీవీ సీరియల్స్లో పాత్రలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు... గతేడాది బెంగుళూరుకు  వచ్చిన సౌరభ్కు తన భర్తకు కూడా పరిచయం చేసింది.  మైసూర్ రోడ్డులో ఉన్న బాధితురాలి ఇంటికి వచ్చిన సౌరభ్.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమెకు ఫ్రూట్ జ్యూస్ ఆఫర్ చేశాడు. అది మహిళలు తాగే డ్రింక్ అని నమ్మించాడు.  దాంతో జ్యూస్ తాగిన  ఆమె స్పృహ కోల్పోయింది.

అదే అదనుగా సౌరభ్ ఆమెపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ మహిళను డబ్బు.. సెక్స్ కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.  ఇటీవల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళిన సౌరభ్... బాధితురాలిని తాను ఉంటున్నహోటల్కు పిలిపించుకున్నాడు. అతడికి కావలసినట్లుగా ఉండాలంటూ బలవంతం చేశాడు.

అంతకు మహిళ నిరాకరించటంతో  తాను చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. అంతేకాకుండా ఆమె భర్తకు కూడా పంపిస్తానంటూ భయపెట్టాడు. అంతేకాకుండా సౌరభ్ ... ఆమెను బెదిరించి సుమారుగా 15 లక్షల రూపాయలను  వసూలు చేశాడు. అంతటితో వదిలిపెట్టకుండా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కూడా అమ్మి ముంబయిలోని తనుండే ఫ్లాట్కు అద్దె కట్టమని డిమాండ్ చేశాడు.  దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైంది. చివరకు ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది.

 సౌరభ్ తన ఇంటికి వస్తున్న విషయాన్ని బాధితురాలు భయంతో.. ఆమె భర్తకు చెప్పలేకపోయిందని, అతడి నుంచీ తప్పించుకోవడం కోసం ఆ మహిళ ఉడిపి జిల్లాలోని తన స్వంత ఊరికి వెళ్ళడం మొదలు పెట్టిందని పోలీసులు తెలిపారు.. నిందితుడి చేతిలో ఆమె తీవ్ర హింసకు గురైందని, సౌరభ్ తీసిన వీడియోలన్నీతాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే బాధితురాలు ఆభరణాలు అమ్మిన షాపు నుంచీ కూడా వివరాలు సేకరించిన బెంగుళూరు పోలీసులు.. కేసులో మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement