అసభ్యకర వీడియోతో బ్లాక్ మెయిలింగ్: పోలీసులకు మహిళ ఫిర్యాదు | Woman blackmailed with her obscene video, raped repeatedly | Sakshi
Sakshi News home page

అసభ్యకర వీడియోతో బ్లాక్ మెయిలింగ్: పోలీసులకు మహిళ ఫిర్యాదు

Published Thu, Nov 28 2013 8:46 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Woman blackmailed with her obscene video, raped repeatedly

ఫరిదాబాద్: ఓ మహిళను బలవంతంగా అనుభవించబమే కాకుండా, ఆ సన్నివేశాలను వీడియోలో బంధించి ఓ యువకుడు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు సంవత్సరాల కూతురితో న్యూ రంజిత్ నగర్ లో ఒంటరిగా ఉంటున్న మహిళకు గోపీచంద్ అనే వ్యక్తి పరిచయమైయ్యాడు.  మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడంతో ఆ మహిళ చత్తర్పూర్లోని ఓ ఫాంహౌస్లో పని చేస్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తనతో చనువుగా ఉండటం మొదలు పెట్టిన గోపీచంద్ పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు.

 

అతనికి అప్పటికే పెళ్లి కావడంతో తాను వ్యతిరేకించినట్లు ఆ మహిళ పేర్కొంది. కాగా, ఓ హోటల్ లో జరిగిన పార్టీలో కూల్డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి తనను బలవంతంగా అనుభవించాడని, అప్పడు తీసిన వీడియో చూసి తరుచు వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నడని పేర్కొంది.ఆ మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement