మూడు పేర్లతో వేధించిన యువతి అరెస్ట్‌  | Young Man Passed Away Due To Girl Blackmail In Warangal District | Sakshi
Sakshi News home page

మూడు పేర్లతో వేధించిన యువతి అరెస్ట్‌ 

Published Tue, Aug 24 2021 3:00 AM | Last Updated on Tue, Aug 24 2021 3:00 AM

Young Man Passed Away Due To Girl Blackmail In Warangal District - Sakshi

రాయపర్తి: ఒకే అమ్మాయి మూడు పేర్లతో వ్యవహరించి యువకుడి ఆత్మహత్యకు కారణ మైంది. ఆ యువతిని అదుపులోకి తీసుకుని కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన మైలపాక సందీప్‌కుమార్‌(23)కు దుగ్గొండి మండలం లక్ష్మిపురానికి చెందిన ఓ యువతి ఫోన్‌ ద్వారా పరిచయమైంది. ఈ క్రమంలో సందీప్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పి అతడికి ప్రియురాలిగా వ్యవహరించింది.

ఇదేసమయంలో అదే యువతి స్రవంతి, కావ్య, మనీషా పేర్లతో వేరే నంబర్ల ద్వారా సందీప్‌తో మాట్లాడి ప్రేమ పేరుతో వల వేసింది. అతడు కూడా ప్రేమగా మాట్లాడటంతో ఆ యువతి సందీప్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించింది. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు ఈనెల 12న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి ఫోన్‌ కాల్స్‌ పరిశీలించిన అనంతరం..ఈనెల 18న అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో ఆ యువతిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement