మాట్లాడాలంటూ హోటల్‌కు పిలిచి అఘాయిత్యాలకు తెగబడ్డారు
భర్త, పిల్లల్ని చంపేస్తానని బెదిరించి దారుణానికి పాల్పడ్డారు.. నిత్యం ఫోన్లు, అర్ధరాత్రి వేళ మెసేజ్‌లతో వేధింపులు
ఆయన ఆగడాలు భరించలేక ఎమ్మెల్యే లీలలు రహస్య కెమెరాలో రికార్డు చేశా
చంద్రబాబు, లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చా
చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.
తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.
వరలక్ష్మి ఇంకా ఏమన్నారంటే..
ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారు. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చేస్తాననే వారు.
చివరకు.. మాట్లాడుకుని విషయం సెటిల్ చేసుకుందామంటూ నమ్మబలికిన ఆదిమూలం.. ఈ ఏడాది జూలై 6న తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించాడు. అక్కడి రూమ్ నెం.109లో నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబంలో అందరినీ చంపేస్తానంటూ బెదిరించడంతో మిన్నకుండిపోయా. ఆయన అంతటితో ఆగకుండా వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో వేధించేవారు. దీంతో.. అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే నుంచి పదేపదే ఫోన్లు రావడాన్ని గమనించిన నా భర్త నన్ను ప్రశ్నించడంతో జరిగిందంతా ఆయనకు చెప్పేశాను. కామాంధుడైన ఎమ్మెల్యే ఆదిమూలానికి బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే నెల పదో తేదీన అదే హోటల్‌లో రూం నెం.105కి ఆయన మళ్లీ రమ్మనడంతో రహస్య కెమెరాలతో వెళ్లాను.
ఆ రోజు ఎమ్మెల్యే నాపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డు అయింది. మరోసారి అదే నెల 17న అదే హోటల్‌లో రూమ్ నెం.105కి రమ్మని మళ్లీ అత్యాచారం చేశాడు. నా వద్ద ఆయన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం నాపై నిఘా ఉంచి, నా చుట్టూ ఆయన మనుషులను మోహరించాడు. మరోవైపు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా నేతను లైంగికంగా వేధించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment