అంబటికి 22 వరకూ రిమాండ్ పొడగింపు | Ambati Rambabu Remand Extended Until 22nd Of This Month February, Details Inside | Sakshi
Sakshi News home page

అంబటికి 22 వరకూ రిమాండ్ పొడగింపు

Feb 9 2026 1:55 PM | Updated on Feb 9 2026 2:14 PM

Ambati Rambabu has been remanded until the 22nd of this month

సాక్షి గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ పొడిగించింది. గతేడాది నవంబర్ 12న పెట్టిన కేసులో ఆయనను కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ర్యాలీ చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దానిపై పీటీవారెంట్ జారీ చేసి కోర్టులో హాజరు పరిచారు.

కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటిరాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. 

ఈ నేపథ్యంలో  అంబటిపై పీటీ వారెంట్లు జారీ చేసి రాష్ట్రమంతా తిప్పాలని సర్కార్ కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో నమోదైన కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను జైలుకు తరలించనున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement