
విదేశాలకు వెళ్లిన నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువతి, విమానాశ్రయంలోనే కన్నమూసిన ఘటన విషాదాన్ని నింపింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న మన్‌ప్రీత్ కౌర్ (24) మెల్‌బోర్న్ నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా అస్వస్థతకు గురైంది. అలాగే విమానం ఎక్కి కూచుంది. సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ఉండగానే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విమాన సిబ్బంది, అత్యవసర సేవలు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించి నప్పటికీ ఫలితం లేకపోయిందని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చునని భావస్తున్నారు. జూన్ 20న ఈ ఘటన జరిగింది.
దీంతో మృతురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె స్నేహితుడు, కౌర్ గ్రామానికి చెందిన గుర్దీప్ గ్రేవాల్ ప్రయత్నిస్తున్నాడు. ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందనీ, తను లేని లోటు తీరనిదంటూ గ్రేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తను చెఫ్ కావాలని కోరుకుందని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment