Man Gives Triple Talaq To Wife For Losing Money To Cyber Frauds In Odisha - Sakshi
Sakshi News home page

సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్‌ చెప్పిన భర్త

Apr 9 2023 12:26 PM | Updated on Apr 9 2023 1:19 PM

Man Gives Triple Talaq To Wife For Losing Money To Cyber Frauds In Odisha - Sakshi

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుందని భార్యకు తలాక్‌ చెప్పాడో ఓ వ్యక్తి. ఈ విచిత్ర ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంది. గుజరాత్‌లో ఉన్న తన భర్త ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్‌ 1న తనకు మూడుసార్లు తలాక్‌ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనకు చట్ట విరుద్ధంగా విడాకులు ఇచ్చారని వాపోయింది. ఆ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు, పైగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఎలా డబ్బులు పోగొట్టుకుందనేది తెలియాల్సి ఉంది. 

(చదవండి: ఏక్‌నాథ్‌ షిండే అయోధ్య పర్యటన: 'మా నమ్మకాలకి సంబంధించింది')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement