ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దండిగా లాభాలు పంచుతామని ఆశపెట్టిన సైబర్ వంచకురాలు ఓ వ్యాపారి నుంచి రూ.లక్షలు కాజేసింది. హుబ్లీలోని ఎగ్గెరి కాలనీకి చెందిన వ్యాపారవేత్త గురుమూర్తి నాణ్యదకు ఓ మహిళ ఫోన్ చేసి తన పేరు లక్ష్మీమెహర్ అని చెప్పి పరిచయం చేసుకుంది. ఓ కంపెనీ పేరు చెప్పి అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టింది.
రూ.32 లక్షలు దశలవారీగా తన బ్యాంకు ఖాతాకు నిధులు మళ్లించుకుంది. లాభాలు రాకపోగా మళ్లీ నగదు జమ చేయాలని ఒత్తిడి చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా ఆమె చేసిన మోసం బట్టబయలైంది. దీంతో బాధితుడు హుబ్లీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
యాప్ అప్‌డేట్ పేరుతో వంచన
హుబ్లీ: ఎస్‌బీఐ యోనో యాప్ అప్‌డేట్ పేరుతో సైబర్ వంచకులు ఓ మహిళను నిండా ముంచారు. వివరాలు...మీ ఎస్‌బీఐ యాప్ త్వరలోనే స్తంభించనుందని, తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ధార్వాడకు చెందిన డాక్టర్ అనుశ్రీ అగ్నిహొత్ర అనే మహిళ సెల్‌కు సందేశం వచ్చింది.
నమ్మిన బాధిత మహిళ సదరు లింక్‌ను ఓపెన్ చేసి పాన్ కార్డు నంబర్, పుట్టిన తేదీతో పాటు ఓటీపీ పంపారు. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.3,94,690 మొత్తాన్ని తమ ఖాతాకు బదలాయించుకున్నారు. దీంతో బాధితురాలు హుబ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment