fake company
-
పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదే
లెబనాన్‌లో వేలాది పేజర్లు ఒకే సమయంలో పేలి వేలాది మందిని గాయపరిచి, కొందరి ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. పేలిన పేజర్లను హంగేరీలోని ఒక సంస్థకు హెజ్బొల్లా, లెబనాన్ సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత రెండ్రోజులుగా వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్లను తయారుచేసిన సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన డొల్ల కంపెనీ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. హంగేరీలో పేరులో ‘బీఏసీ’ అక్షరాలుండే కంపెనీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. వీటి పోలికలతో ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ పేరిట ఒక నకిలీ కంపెనీని ఇజ్రాయెల్ స్థాపించింది. పేజర్లను అది తయారుచేస్తుంది. హెజ్బొల్లా సభ్యులకు పేలుడు పదార్థమున్న పేజర్లను సరఫరా చేసి వారిని అంతంచేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం ముగ్గురు ఇజ్రాయెల్ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్ నుంచి పేజర్ల సరఫరా కాంట్రాక్ట్ సంపాదించేందుకు ఇజ్రాయెల్ చాన్నాళ్ల క్రితమే మూడు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ మూడు కంపెనీల్లో ఒకటైన బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు, ఇజ్రాయెల్‌కు సంబంధం ఉంటుందని హెజ్బొల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఏసీ కన్సల్టింగ్ సంస్థకే హెజ్బొల్లా పేజర్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిందని ఇరాన్‌లోని మెహర్ న్యూస్ఏజెన్సీ వివరించింది. బీఏసీ కన్సల్టింగ్ గత మూడేళ్లుగా తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్‌తో పేజర్లు తయారుచేసి విక్రయిస్తోంది. దీంతో హెజ్బొల్లా నుంచి చాలా సులువుగా బీఏసీ సంస్థ ఆర్డర్ సాధించగల్గిందని మెహర్ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్ దేశానికి చెందిన పేజర్లు పేలితే తనకేం సంబంధం అన్నట్లు ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీఏసీ కన్సల్టింగ్ వాదన మరోలా ఉండటం విశేషం. ‘‘ పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం కేవలం వాటిని రవాణా చేశాం’’ అని బీఏసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిణి క్రిస్టినా బార్సోనీ అర్సిడియాకోనో స్పష్టంచేశారు. పేలిన పేజర్లను మాత్రమేగాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్లను ఈ సంస్థ తయారుచేసినట్లు సమాచారం. ఈ సాధారణ పేజర్లు ఏవీకూడా పేలినట్లు వార్తలు రాలేదు. హెజ్బొల్లా సభ్యులు వాడిన, పేలిన పేజర్లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారుచేసి ఉంటారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళ ఫోన్ కాల్.. దండిగా లాభాలు వస్తాయని చెప్పి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దండిగా లాభాలు పంచుతామని ఆశపెట్టిన సైబర్ వంచకురాలు ఓ వ్యాపారి నుంచి రూ.లక్షలు కాజేసింది. హుబ్లీలోని ఎగ్గెరి కాలనీకి చెందిన వ్యాపారవేత్త గురుమూర్తి నాణ్యదకు ఓ మహిళ ఫోన్ చేసి తన పేరు లక్ష్మీమెహర్ అని చెప్పి పరిచయం చేసుకుంది. ఓ కంపెనీ పేరు చెప్పి అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టింది. రూ.32 లక్షలు దశలవారీగా తన బ్యాంకు ఖాతాకు నిధులు మళ్లించుకుంది. లాభాలు రాకపోగా మళ్లీ నగదు జమ చేయాలని ఒత్తిడి చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా ఆమె చేసిన మోసం బట్టబయలైంది. దీంతో బాధితుడు హుబ్లీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. యాప్ అప్డేట్ పేరుతో వంచన హుబ్లీ: ఎస్బీఐ యోనో యాప్ అప్డేట్ పేరుతో సైబర్ వంచకులు ఓ మహిళను నిండా ముంచారు. వివరాలు...మీ ఎస్బీఐ యాప్ త్వరలోనే స్తంభించనుందని, తక్షణమే అప్డేట్ చేసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ధార్వాడకు చెందిన డాక్టర్ అనుశ్రీ అగ్నిహొత్ర అనే మహిళ సెల్‌కు సందేశం వచ్చింది. నమ్మిన బాధిత మహిళ సదరు లింక్‌ను ఓపెన్ చేసి పాన్ కార్డు నంబర్, పుట్టిన తేదీతో పాటు ఓటీపీ పంపారు. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.3,94,690 మొత్తాన్ని తమ ఖాతాకు బదలాయించుకున్నారు. దీంతో బాధితురాలు హుబ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
స్టాక్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ మోసం
నాగోలు: స్టాక్ మార్కెట్ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టబడులు పెడితే ఐదు రెట్ల వరకు సొమ్మును తిరిగి ఎక్కువ చెల్లిస్తామని ఆన్లైన్ వేదికగా మోసానికి పాల్పడుతున్న బెంగుళూరుకు చెందిన ముఠాలోని ఇద్దరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు కంప్యూటర్లు, నాలుగు సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, రెండు డీమాట్ అకౌంట్లతో పాటు ఇతర సామగ్రిని సైబర్ క్రైమ్ పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ లోని రాచకొండ సైబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ, రాచకొండ సైబర్ క్రైమ్ ఇంచార్జ్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. బీహార్‌కు చెందిన రాహుల్ కుమార్, చిత్తూరుకు చెందిన అనంత సూర్య చైతన్యలు బెంగుళూరులో డైరెక్ట్ నేషనల్ స్టాక్ రీసెర్చ్ కార్యాలయాన్ని స్థాపించారు. వీరితో పాటు అదే ప్రాంతానికి చెందిన దీపక్, చంద్రశేఖర్, విజయ్ రమేశ్, నారాయణ్ ను కంపెనీలో ఉద్యోగులుగా పెట్టుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ పేరుతో వివిధ ప్రాంతాల్లోని డీమాట్ అకౌంట్ కలిగిన వారికి తరచు ఫోన్స్ చేస్తూ, మెయిల్స్ పెడుతూ తమ కంపెనిలో పెట్టుబడి పెడితే 28 రోజుల్లో 5 నుంచి 11 రెట్లు ఎక్కవ డబ్బు వస్తాయని నమ్మలికారు. ఈ క్రమంలో నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన సాఫ్వేర్ ఉద్యోగి శ్రావణ్ చిట్టిరెడ్డికి వాట్సప్, మెయిల్స్ ద్వారా తరచుగా మెసేజ్‌లో పెడుతూ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరారు. ఇది నమ్మిన శ్రావణ్ చిట్టిరెడ్డి ఆన్లైన్ యాప్ ద్వారా రూ.1,82,116 ను జూలై నెలలో బదిలీ చేశారు. తదంతరం నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సంస్థ కార్యాలయం సభ్యులు స్పందించకపోవటంతో మోసపోయినట్లు గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్‌లు బెంగుళూర్‌కు వెళ్ళి సంస్థ కార్యాలయాలు తనిఖీ చేయగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీకి సంబంధం లేని నకిలీ సంస్థగా పోలీస్‌లు గుర్తించారు. దేశవ్యాప్తంగా డీమాట్ హోల్డర్ లను గుర్తించి వారి డేటాను కొనుగోలు చేసి మోసానికి పాల్పడుతున్నారని దేశవ్యాప్తంగా అనేక మందిని అన్లైన్ ద్యారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ ముఠా సభ్యులు సుమారు రూ.70 లక్షల వరకు మోసం చేశారు. ప్రధాన నిందితులైన రాహుల్ కుమార్, అనంత సూర్యచంద్ర లను అరెస్ట్ చేశారు. సమావేశంలో సైబర్ క్రైమ్ సీఐ లు కె.వి.విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ఘరానా మోసం.. ముగ్గురి అరెస్ట్
వరంగల్: ఓ నకిలీ కంపెనీ పేరుతో ఆన్లైన్లో ఘరానా మోసానికి పాల్పడ్డారో ముగ్గురు యువకులు. వారిని తొర్రూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆర్జీ గ్రూప్ మనీ సర్య్కూలేషన్ అనే సంస్థ పేరుతో ముగ్గురు యువకులు ఆన్లైన్లో మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురి నుంచి రెండు కార్లు, ల్యాప్‌టాప్, నాలుగు ఫోన్లు, రూ. 7 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.