వరంగల్: ఓ నకిలీ కంపెనీ పేరుతో ఆన్లైన్లో ఘరానా మోసానికి పాల్పడ్డారో ముగ్గురు యువకులు. వారిని తొర్రూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆర్జీ గ్రూప్ మనీ సర్య్కూలేషన్ అనే సంస్థ పేరుతో ముగ్గురు యువకులు ఆన్లైన్లో మోసానికి పాల్పడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురి నుంచి రెండు కార్లు, ల్యాప్టాప్, నాలుగు ఫోన్లు, రూ. 7 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్లైన్లో ఘరానా మోసం.. ముగ్గురి అరెస్ట్
Published Thu, Apr 28 2016 4:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement
Advertisement