సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’కి విశేష ఆదరణ లభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 67 వేలమంది యూట్యూబ్ శిక్షణకు ఎన్రోల్ అయ్యారు .తొలిరోజు జరిగిన వెబినార్ లో సైబర్ సేఫ్ జోన్ పై అవగాహన కల్పించారు .సైబర్ ఫీస్ ఫౌండేషన్ ఛైర్మన్ రక్షిత్ టాండన్ చేత ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్,ఆన్‌లైన్ యాప్‌ల పాస్‌వర్డ్ విషయంలో మెళకువలు నేర్పించారు. ఆన్‌లైన్‌లో చీటింగ్ ఎలా చేస్తారో వివరించారు. సైబర్ సేఫ్టీకి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని 4s 4u పోర్టల్‌లో తెలుగులో పొందుపరిచారు.
(చదవండి : ‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్)
రౌడీ షీట్ ల తరహాలో సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచి ఆన్లైన్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెడతామంటున్న సీఐడీ ఎస్పీ రాధిక ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఈ రక్షాబంధన్‌కు మంచి ప్రతిస్పందన వస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. యూట్యూబ్ శిక్షణలో ఎన్రోల్ అయ్యేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. నెల రోజుల శిక్షణలో లక్షలాదిమంది మహిళలను సైబర్ నేరాలను ఎదుర్కొనే సైనికుల్లా తయారు చేస్తామని చెప్పారు. సైబర్ ఉచ్చువేసి మహిళలను వేధించేవారిపై సైబర్ బుల్లీయింగ్ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. రౌడీ షీటర్ల తరహాలోనే సైబర్ షీట్ నేరగాళ్ల కదలికపై నిఘా పెడతామని తెలిపారు. 4S 4U పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 9071666666 వాట్సాప్ నంబర్ కి వివరాలు పంపితే సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకొంటామని సీఐడీ ఎస్పీ రాధిక అన్నారు. (చదవండి :మనబడి నాడు-నేడు: సీఎం జగన్ కీలక ఆదేశాలు)
రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘ఈ- రక్షాబంధన్’కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment