అనుమానాస్పద యూఆర్‌ఎల్‌లు, యాప్‌ల పనిపడుతున్న టీఎస్ సైబర్ సెక్యూరిటీ సిబ్బంది
గత జూన్ నుంచి డిసెంబర్ వరకు 1,457 లింక్‌లు బ్లాక్
ఈ ఏడాదిలో 4 నెలల్లో 817 యూఆర్‌ఎల్ లింక్‌లు బ్లాక్
1930 టోల్‌ఫ్రీ నంబర్, సైబర్ క్రైం పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విశ్లేషణ..
సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో కీలక చర్యలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ). సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేసేందుకు వాడుతున్న నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లకు సంబంధించిన యూఆర్‌ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయిస్తున్నారు.
అదేవిధంగా సైబర్ నేరగాళ్లు వాడుతున్న ఫేక్ కస్టమర్ నంబర్లను కూడా బ్లాక్ చేయిస్తున్నారు. ఒకే నకిలీ వెబ్‌సైట్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌ను వినియోగించి సైబర్ కేటుగాళ్లు మరోమారు మోసగించేందుకు అవ కాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేíÙస్తున్న టీఎస్‌సీఎస్‌బీ అధికారులు అందులోని అనుమానాస్పద వెబ్‌సైట్‌లు, యాప్‌లపై ఫోకస్ పెడుతున్నారు.
శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తూ ఆయా సంబంధిత మాతృ కంపెనీలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అనుమానాస్పద యూఆర్‌ఎల్‌లను డౌన్ (డిలీట్) చేయిస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తు, విశ్లేషణ కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరో అందుబాటులోకి వచ్చిన తర్వాత నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల మకిలి వదిలించే పని ముమ్మరంగా కొనసాగుతోందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేకంగా సిబ్బంది...
సైబర్ మోసాలకు సంబంధించి పౌరుల నుంచి 1930 కాల్ సెంటర్‌కు లేదా సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్‌కు అందే ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ప్రధానంగా రెండు రకాల విధులను టీఎస్‌సీఎస్‌బీ నిర్వర్తిస్తోంది. బాధితులు పొగొట్టుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టకుండా బ్యాంకులకు వెంటనే సమాచారం ఇచ్చి ఆ సొమ్మును ఫ్రీజ్ చేయించడంతోపాటు కేసు దర్యాప్తు కొనసాగించడం ఒక ప్రధాన విధి.
మరోవైపు సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు వినియోగించిన యాప్ లేదా వెబ్‌సైట్ వివరాల నుంచి అవి నిజమైనవా నకిలీవా కనిపెట్టి ఆ అనుమానాస్పద యూఆర్‌ఎల్‌ను డౌన్ చేయించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు సేకరించడం. ఇందుకోసం టీఎస్‌సీఎస్‌బీలో ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతోపాటు సెక్స్‌టార్షన్, సైబర్ బుల్లియింగ్‌కు గురైన బాధితుల ఫిర్యాదుల నుంచి సేకరించిన వెబ్‌సైట్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
టీఎస్‌సీఎస్‌బీలోని ప్రత్యేక సిబ్బంది ఓపెన్ సోర్స్ టూల్స్‌ను, ఇతర సాంకేతికతను వినియోగించి సదరు యూఆర్‌ఎల్ నకిలీదని గుర్తిస్తారు. ఆ తర్వాత ఆ ఫేక్ వెబ్‌సైట్‌గా గుర్తించిన యూఆర్‌ఎల్ యాక్టివ్‌గా ఉందా.. లేదా అన్నది విశ్లేíÙస్తారు. ఆ తర్వాత సదరు నకిలీ వెబ్‌సైట్ ఏ పేరుతో ఉంది..దాన్ని హోస్ట్ చేస్తున్న వర్చువల్ సర్వర్ ఐపీ అడ్రస్ గుర్తిస్తారు. హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరైతే వారికి టీఎస్‌సీఎస్‌బీ నుంచి అధికారికంగా లేఖ రాస్తారు.
అదేవిధంగా ఆధారాలు పంపి..దాన్ని డౌన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా 2023లో జూన్ నుంచి డిసెంబర్ వరకు 1,457 ఫేక్ యూఆర్‌ఎల్‌లను డౌన్ చేయించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 817 యూఆర్‌ఎల్స్‌ను డౌన్ చేయించారు. ఇది నిరంతరం కొనసాగుతోందని, దీనివల్ల సైబర్ నేరగాళ్లు మళ్లీమళ్లీ మోసాలకు పాల్పడకుండా కట్టడి చేసేందుకు వీలుపడుతుందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment