ఢిల్లీ: క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన లక్షయ్ విజ్(33) అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. లిసా రోత్ అనే అమెరికా మహిళ వద్ద 3.3 కోట్లు దొచుకున్నట్లు లక్షయ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం జూలై 22 (సోమావారం) లక్షయ్‌ని ఈడీ అదుపులోకి తీసుకున్న తీసుకుంది. అనంతరం అతన్ని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు జూలై 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. మరోవైపు.. అమెరికా మహిళను మోసం చేసిన పలువురిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తోంది.
అమెరికాకు చెందిన మహిళను నిందితుడు తాను ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా చెప్పుకొని సంప్రదించాడు. ఆమె వాడుతున్న బ్యాంక్ అకౌంట్ సురక్షితం కాదని నమ్మించాడు. అందులో ఉన్న డబ్బులను అమె బ్యాంక్ ఖాతా నుంచి క్రిప్టో కరెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒప్పించాడు. ఆమె పర్సనల్ కంప్యూటర్ అనధికారిక యాక్సెస్‌ను సంపాధించి.. ఆమె పేరు మీద క్రిప్టోకరెన్సీ ఖాతాను క్రియేట్ చేశారు. ఈ ఖాతాకు 400,000 అమెరికా డాలర్లను బదిలీ చేయాలని తెలిపారు. బాధితురాలు తన బ్యాంక్ వివరాలను చెక్ చేసుకోగా.. తన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు.
నిందితుడు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి దొచుకున్న డబ్బును వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లలోకి ట్రాన్స్‌ఫెర్ చేసినట్లు ఈడీ విచారణలో తెలిసింది. ఆ డబ్బును ఇండియన్ కరెన్సీలోకి నిందితులు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు పలు నకిలీ సంస్థలు, వ్యక్తుల ఖాలా ట్రాన్‌ఫర్ అయినట్లు తెలిపారు.
జూన్ 6న ఈడీ నిర్వించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేరుతో రికార్డు అయిన ట్రాన్జాక్షన్ల ఆధారంగా వారి వద్ద ఈడీ అధికారులు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. లక్షయ్ విజ్.. ప్రధానంగా వాట్సాప్ గ్రూపులను ఉపయోగించి ట్రాన్జాక్షన్లు చేసిన క్రిప్టోకరెన్సీ హ్యాండ్లర్‌గా ఈడీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment