duped
-
బుద్ధిమంతుడి ముసుగుతో అమ్మాయిలకు టోకరా
బుద్ధిమంతుడిలా నటించి.. డేటింగ్ ప్లాట్ఫామ్లో మోడల్‌నంటూ నమ్మించి వందల మంది యువతులను మోసగించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తుషార్ సింగ్ బిష్ట్‌ను దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 23 ఏళ్ల తుషార్ సింగ్ బిష్ట్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. తుషార్ బీబీఏ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ డబ్బుపై దురాశతో సైబర్ నేరాలకు అలవాటుపడ్డాడు. ఓ యాప్ నుంచి వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబరు కొనుగోలు చేసి డేటింగ్ యాప్ బంబుల్, సోషల్ మీడియా వేదిక స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోలు, స్టోరీలను తీసుకుని తన ప్రొఫైల్‌లో పోస్ట్ చేసేవాడు. అమెరికాలో తాను ఫ్రీలాన్స్ మోడల్‌గా పనిచేస్తున్నానని, త్వరలోనే భారత్ వస్తున్నానని నమ్మించి అనేకమంది యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారితో స్నేహం చేసి ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. కొంతకాలానికి ఆ వీడియోలతోనే వారిని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.గతేడాది డిసెంబరులో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతి తుషార్‌పై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తులో అతగాడి మోసాల చిట్టా బయటకు వస్తోంది. 2024 జనవరిలో బంబుల్‌లో అతడితో పరిచయం అయినట్లు బాధిత యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేటు వీడియోలు తీసుకొని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని డార్క్‌వెబ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి.ఇప్పటిదాకా దాదాపు 700 మందికి పైగా అమ్మాయిలను అతడు వలలో వేసుకున్నట్లు గుర్తించారు. బంబుల్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు తెలిపారు. అతడిని అరెస్టు చేసి ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అమెరికా మహిళకు రూ.3.3 కోట్ల టోకరా.. ఈడీ అరెస్ట్
ఢిల్లీ: క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన లక్షయ్ విజ్(33) అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. లిసా రోత్ అనే అమెరికా మహిళ వద్ద 3.3 కోట్లు దొచుకున్నట్లు లక్షయ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం జూలై 22 (సోమావారం) లక్షయ్‌ని ఈడీ అదుపులోకి తీసుకున్న తీసుకుంది. అనంతరం అతన్ని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు జూలై 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. మరోవైపు.. అమెరికా మహిళను మోసం చేసిన పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తోంది.అమెరికాకు చెందిన మహిళను నిందితుడు తాను ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా చెప్పుకొని సంప్రదించాడు. ఆమె వాడుతున్న బ్యాంక్ అకౌంట్ సురక్షితం కాదని నమ్మించాడు. అందులో ఉన్న డబ్బులను అమె బ్యాంక్ ఖాతా నుంచి క్రిప్టో కరెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని ఒప్పించాడు. ఆమె పర్సనల్ కంప్యూటర్ అనధికారిక యాక్సెస్‌ను సంపాధించి.. ఆమె పేరు మీద క్రిప్టోకరెన్సీ ఖాతాను క్రియేట్ చేశారు. ఈ ఖాతాకు 400,000 అమెరికా డాలర్లను బదిలీ చేయాలని తెలిపారు. బాధితురాలు తన బ్యాంక్ వివరాలను చెక్ చేసుకోగా.. తన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు.నిందితుడు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి దొచుకున్న డబ్బును వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లలోకి ట్రాన్స్ఫెర్ చేసినట్లు ఈడీ విచారణలో తెలిసింది. ఆ డబ్బును ఇండియన్ కరెన్సీలోకి నిందితులు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు పలు నకిలీ సంస్థలు, వ్యక్తుల ఖాలా ట్రాన్ఫర్ అయినట్లు తెలిపారు.జూన్ 6న ఈడీ నిర్వించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేరుతో రికార్డు అయిన ట్రాన్జాక్షన్ల ఆధారంగా వారి వద్ద ఈడీ అధికారులు స్టేట్మెంట్లు తీసుకున్నారు. లక్షయ్ విజ్.. ప్రధానంగా వాట్సాప్ గ్రూపులను ఉపయోగించి ట్రాన్జాక్షన్లు చేసిన క్రిప్టోకరెన్సీ హ్యాండ్లర్‌గా ఈడీ అధికారులు గుర్తించారు. -
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్ని రోజులు ఆన్లైన్లో సైబర్ నేరస్తులు.. దొంగచాటుగా ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును కాజేయడం రివాజుగా మారింది.కానీ రాను రాను సైబర్ మోసగాళ్లు తెలివి మీరుతున్నారు. తాజాగా, చెల్లెమ్మా.. మేం మీకు దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ అందిన కాడికి సొమ్మును దోచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్నోకు చెందిన ఓ మహిళను రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్‌లు పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ తమపై నమ్మకం పెరిగేలా మెసిలారు. రోజులు గడుస్తున్నాయి. మాటలు కోటలు దాటాయి.ఆన్ లైన్ స్నేహాలు కాస్తా.. ఆఫ్ లైన్లోనే ఇరువురి ఫోన్‌నెంబర్లు ఇచ్చు పుచ్చుకునే వరకు వెళ్లింది. గుడ్ మార్నింగ్‌లు, గుడ్నైట్లు..ఫెస్టివల్ విషెస్‌తో ఆమెపై అన్న ప్రేమను ఒలకబోసేవారు. వారిపై ఆమెకు నమ్మకం కలగడంతో వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండేది. అయితే ఓ రోజు త్వరలో తన పెళ్లి రోజు అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఆ ముగ్గురికి చెప్పింది. అంతే ఆమె డబ్బును కాజేయాలని కేటుగాళ్లు ప్లాన్ చేశారు.ప్లాన్‌లో భాగంగా మనోజ్‌కుమార్ బాధితురాలికి ఫోన్ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు షిప్పింగ్ అవసరాల కోసం తన ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను షేర్ చేసింది.కట్ చేస్తే విమానాశ్రయంలో తాను కొన్న ఖరీదైన గిఫ్ట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారని, దానిని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని మనోజ్ ఆమెకు ఫోన్ చేశాడు. డబ్బులు చెల్లించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేను చెప్పినట్టు చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని ప్రమేయం చేసి నన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. బెదిరింపుల కారణంగా, ఒత్తిడికి గురైన ఆమె క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపోయామంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అభిజిత్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లో దొరికే ప్రేమల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. -
వివేక్ ఒబెరాయ్‌కి రూ.1.55 కోట్ల టోకరా
ముంబై: సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆర్థిక నేరాల బారినపడుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ ఇద్దరు వ్యాపార భాగస్వాములు నమ్మించారు. ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ, ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు సొంతానికి వాడుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. -
ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా?
మోసం... సాధారణంగా ఇది నమ్మకాన్ని ఆనుకుని ఉంటుందేమో! అందుకే నమ్మిన వ్యక్తులనే ఎదుటివారు నయవంచన చేస్తుంటారు. మోసాలకు పాల్పడేవారు ఎదుటివారి మానసిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారు. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఎంతటి సంపన్నులైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లెక్కకు అందనంత బిలియన్ డాలర్లకు సంబంధించిన మోసాల వార్తలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, ఎఫ్‌టీఎక్స్ (బహామాస్-ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్) వ్యవస్థాపకుడు. ఈయన తన కంపెనీ పెట్టుబడిదారులుగా ప్రముఖులను ఆకర్షించి, వారి చేత పెట్టుబడులు పెట్టించారు. ఈ ప్రముఖుల జాబితాలో టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ తదితరులు ఉన్నారు. బిలియనీర్ అయిన బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది. ఇప్పుడు ఎఫ్‌టీఎక్స్ దివాలా కంపెనీ. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మోసానికి సంబంధించిన పలు కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎలిజబెత్ హోమ్స్ చేసిన పని ఇదే.. ఇదే కోవలోనే ఎలిజబెత్ హోమ్స్ కథ కూడా ఉంటుంది. హోమ్స్ అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా పేరొందింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె నికర విలువ ఆస్తుల $4.5 బిలియన్లు. ప్రస్తుతం పనిచేయని ఆమె సంస్థ థెరానోస్‌లో ఆమె 50% వాటా కలిగివుంది. థెరానోస్ కంపెనీ పెట్టుబడిదారుల జాబితాలో రూపర్ట్ ముర్డోక్, వాల్టన్ కుటుంబంతో సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. 2022లో ఆమెపై వచ్చిన ఆరోపణలలో దోషిగా తేలిన నేపధ్యంలో ఆమె యూఎస్ నుండి పారిపోయే ప్రయత్నంలో హోమ్స్ మెక్సికోకు వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్,హోమ్స్లు తెలివైనవారిని ప్రముఖులను ఎలా మోసం చేశారు? వీరు నైపుణ్యం కలిగిన మోసగాళ్ల మాదిరిగానే, ఎదుటివారి భావోద్వేగాలను, వారి అవసరాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి.. ఇలా మోసపోతున్న బాధితుల జాబితాలో అమాయకులు, వయసుపైబడినవారు సాధారణంగా కనిపిస్తారు. మోసాలకుగురయిన బాధితుల డేటా భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా నిశితంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది. దీనిపై పరిశోధకులు చేపట్టిన పరిశోధనలలో అధునికులు, బాగా చదువుకున్నవారు, యువకులందరూ స్కామ్‌లకు గురవుతారని వెల్లడయ్యింది. మోసగాళ్ళు నిర్దిష్ట జనాభాను తమ లక్ష్యంగా చేసుకుంటారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగర్భం.. లోపల ఏముందో చూసేసరికి.. మితిమీరిన నమ్మకంతోనే.. దుర్బలత్వంతో కూడిన మితిమీరిన నమ్మకమే మోసాలకు ప్రధాన కారకం అని కూడా పరిశోధనలో కనుగొన్నారు. ఒక రంగంలో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం మరో రంగంలో వీక్‌గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారు. ఉదాహరణకు బెర్నీ మాడాఫ్.. ఆర్థిక నిపుణులు కాని సంపన్నులను, బాగా చదువుకున్న వృత్తిపరమైనవారిని సులభంగా మోసం చేశారని పరిశోధనలో తేలింది. చాలామంది విపరీతమైన నమ్మకం కారణంగానే స్కామ్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీనికి ఉదాహరణ లాటరీ విజేతలు వీరే నంటూ వచ్చే ప్రకటనలు. ఇవి ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చాలామంది వీటి బారిన పడి మోసపోతుంటారు. సాధారణంగా మోసగాళ్లు ఇతరులలో భవిష్యత్ భయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తారు. దీంతో మోసగాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దీంతో వారు ఎదుటివారిలో తమపై మరింత నమ్మకం కలిగేలా వాతావరణం సృష్టిస్తారు. సెలబ్రిటీలు- సామాజిక గుర్తింపు సోషల్ ప్రూఫ్ అనేది మనస్తత్వవేత్త రాబర్ట్ సియాల్డిని రూపొందించబడిన పదం. వినియోగదారులు.. ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుని, దానికి ప్రతిస్పందనగా తాము ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. దీనినే సోషల్ప్రూప్ అనవచ్చు. సెలబ్రిటీలు తమ సామాజిక గుర్తింపును ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పలువురు ప్రముఖులు ఆధునిక సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉత్పత్తి లేదా సేవల ప్రభావంపై అమితమైన నమ్మకం కలిగివుంటారు. క్రిప్టోకరెన్సీ బారినపడి.. అక్టోబర్ 2022లో కిమ్ కర్దాషియాన్.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రచురించినందుకు $250,000 చెల్లించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆమె యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి $1.26 మిలియన్ సెటిల్మెంట్ చెల్లించడానికి అంగీకరించారు. ఆమె నెలకొల్పిన సంస్థ ఎథేరియం మ్యాక్స్ బారినపడి సెలబ్రిటీలు మడోన్నా, జస్టిన్ బీబర్, డీజే ఖలీద్, పారిస్ హిల్టన్, గ్వినేత్ పాల్ట్రో, స్నూప్ డాగ్, సెరెనా విలియమ్స్, జిమ్మీ ఫాలన్లు మోసపోయారని తేలింది. అప్రమత్తతతో నేరాలకు అడ్డుకట్ట పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే ఆర్థికంగా దిగువస్థాయిలో ఉన్నవారి కంటే ధనవంతులను లేదా సంస్థలను మోసం చేయడం చాలా సులభం. నిపుణులు మోసాలకు గురైన వారిని ఇంటర్వ్యూ చేయగా వారు ‘బ్రాండ్’కు అమితంగా ప్రభావితమయ్యారని, మోసపోయినా వారు బహిర్గతం చేయడానికి, అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలింది. సోషల్ మీడియా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడి మోసాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి ఎందుకు పంపిస్తున్నారంటే.. -
కేటుగాళ్లు.. కలెక్టర్ డీపీ పెట్టుకుని 1.40 లక్షలు కొట్టేశారు
సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్‌తో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం నంబర్‌కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు. వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
విమానం మిస్సయిందని చెప్పి...
న్యూఢిల్లీ: ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో చదువుతున్నానని, ఫ్లైట్ మిస్ కావడంతో వేరే విమానంలో సొంతూరు వెళ్లేందుకు డబ్బు సాయం చేయాలని మోసం చేస్తున్న ఓ యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మోదెల వెంకట దినేశ్‌కుమార్ నాలుగైదేళ్లుగా ఈ దందా చేస్తూ 100 మందికి పైగా ప్రయాణికులను మోసగించినట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి డిసెంబర్ 19న బరోడా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. టెర్మినల్–3 వద్ద ఉన్న ఆయన్ను దినేశ్ మాటల్లోకి దించాడు. విదేశీ వర్సిటీ విద్యార్థినని పరిచయం చేసుకుని సొంతూరు విశాఖపట్టణం వెళ్లే విమానం మిస్సయిందని టికెట్‌ను చూపించాడు. మరో ఫ్లైట్‌లో వెళ్లాలంటే తన వద్ద ఉన్న రూ.6,500 సరిపోవని, విశాఖకు టికెట్ ఖరీదు రూ.15వేలు ఉంటుందని చెప్పాడు. ఇంటికి వెళ్లాక తిరిగి పంపిస్తానంటూ నమ్మబలికి ఆయన వద్ద నుంచి రూ.9,250 తన బ్యాంకు అకౌంట్‌కు గూగుల్ పేద్వారా వేయించుకున్నాడు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీ నేతకు టోకరా.. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని రూ.50 లక్షలు మోసం
తిరువొత్తియూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం చేసిన కేంద్ర మంత్రి మాజీ సహాయకుడు నరోత్తమన్, అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి జయలక్ష్మినగర్‌కు చెందిన బీజేపీ నేత భువనేష్ కుమార్ (29) చెన్నై పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జూలైలో ఓ ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. “మా చిన్నాన్న కుమార్తె వసంతికి ఆరణి టికెట్ కోసం పెరంబూరుకు చెందిన విజయరాఘవన్ సంప్రదించాం. అతని ద్వారా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయకుడు నరోత్తమన్‌ను కలిశాం. అతను ఎమ్మెల్యే టికెట్ తీసివ్వడానికి రూ.కోటి ఇవ్వాలని కోరారు. తొలుత రూ.50 లక్షలు ఇవ్వాలని.. అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత మిగిలిన రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో నగదు ఇచ్చాను. జాబితాలో పేరు లేకపోవడంతో నగదు తిరిగి ఇవ్వమని కోరినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో నరోత్తమన్‌తో పాటు అతని తండ్రి చిట్టిబాబు, విజయరాఘవన్‌పై చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని’ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నరోత్తమన్‌ను తొలగించారు. పాండిబజార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని నరోత్తమన్, చిట్టబాబును అరెస్టు చేసి శనివారం చెన్నైకి తీసుకొచ్చారు. -
‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’
చెన్నై: ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజే వేరు. చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జీవితంలో సెటిల్ అయినట్లే. ఉద్యోగ భద్రత ఉంటుంది.. జీతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. ప్రమోషన్‌కు డోకా ఉండదు. అందుకే యువతకు గవర్నమెంట్ జాబ్ అంటే అంత మోజు. దీన్ని ఆసారా చేసుకుని.. క్యాష్ చేసుకునే మోసగాళ్లకు కొదవే లేదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్పిస్తానంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు తమిళనాడుకు చెందిన ఓ కేటుగాడు. ఆ వివరాలు.. (చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం) నిందితుడిని కన్నణ్‌గా గుర్తించారు పోలీసులు. ఇతడు చెన్నై సెక్రటేరియట్ కాంప్లేక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కన్నణ్కి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాధితుడు రంగస్వామితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా తన కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు రంగస్వామి. విషయం తెలుసుకున్న కన్నణ్.. తాను సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోనే అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపాడు. రంగస్వామి కుమారుడి రెజ్యూమ్ ఇవ్వమన్నాడు. దాన్ని పరిశీలించి.. తనకు 30 లక్షల రూపాయలు ఇస్తే.. సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపాడు. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారిగా కన్నణ్ అడిగిన మొత్తాన్ని అతడికి ఇచ్చాడు రంగస్వామి. (చదవండి: పాపం అవినాష్.. కరోనాతో మరణించాక డీఎస్పీ కొలువొచ్చింది) తీరా డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత కూడా జాబ్ ఇప్పించకపోవడంతో.. రంగస్వామి, అతడి స్నేహితుడు కన్నణ్‌ని ప్రశ్నించారు.. తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదు కన్నణ్. ఈ క్రమంలో రంగస్వామి జరిగిన మోసం గురించి పోలీసులను ఆశ్రయించాడు. రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్నణ్‌ని అరెస్ట్ చేశారు. అతడు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కన్నణ్ జైలులో ఉన్నాడు. చదవండి: మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్ -
మోడల్‌గా ఛాన్స్ ఇప్పిస్తానని..
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రాంలో మహిళా మోడల్‌గా నమ్మబలకడంతో పాటు ఉద్యోగాల ఆశ చూపి పలువురు మహిళలను మోసగించిన ప్రబుద్ధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మాం చంద్ అలియాస్ దీపక్ తనను మహిళా మోడల్‌గా చెప్పుకుంటూ తాను ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నానని ఓ వెబ్ సిరీస్ కోసం కొత్త మోడల్స్ కోసం అన్వేషిస్తున్నామని నమ్మబలికాడని పోలీసులు వెల్లడించారు. రాశీ గోయల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో సంప్రదించారని, ఆమె ఓ మోడల్‌గా తనను పరిచయం చేసుకున్నారని బాధితురాలు ఆరోపించారు. చదవండి : మొబైల్ ఫోన్ల ఈఎమ్ఐ పేరిట భారీ మోసం తమ వెబ్‌సిరీస్ కోసం కొత్త మోడల్స్ కోసం చూస్తున్నామని నమ్మబలికిందని చెప్పారు. ఆడిషన్స్ కోసం నగ్నచిత్రాలు పంపగలరా అని కోరినట్టు తెలిపారు. రాశీ గోయల్‌కు తాను నగ్నచిత్రాలను పంపానని, పదేపదే అలాంటి ఫోటోలను పంపాలని కోరడంతో ఇన్‌స్టాగ్రాంలో ఆ ఖాతాను బ్లాక్ చేశానని ఫిర్యాదిదారు వెల్లడించారు. ఆ తర్వాత తనకు ఇద్దరు వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారు వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా సుల్తాన్‌పురిలోని ఇంటి నుంచి నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఓ కేసులో హరియాణాలోని హిసార్‌లో నిందితుడు ఓసారి అరెస్ట్ అయ్యాడని పోలీసులు చెప్పారు. -
‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’
అజ్మీర్: సోషల్ మీడియాలో మహిళలను పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో మోసగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. అజ్మీర్ కొత్రాలోని ప్రగతినగర్ ప్రాంతానికి చెందిన మహిళకు ఫెస్‌బుక్‌లో ఓ వ్యక్తి ఫ్రెండ్ రెక్వేస్ట్ పంపించాడు. దీంతో సదరు మహిళ ఆ రెక్వేస్ట్ను యాక్సెప్ట్ చేసింది. తాను జర్మనీలో డాక్టర్‌గా పనిచేస్తున్నామని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫెస్‌బుక్‌లో వారి మధ్య చాటింగ్, మాట్లాడుకోవటం కోనసాగింది. కొన్ని రోజులకు అతను ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పాడు. దీంతో ఆమె అతని ప్రేమలో పడింది. అలా ఒక రోజు ఆ వ్యక్తి ఓ ఖరీదైన బహుమతిని ఆమె కోసం పంపాడు. (హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య) అనంతరం కొన్ని రోజుల తర్వాత తనకు రూ 1.5 లక్షలు డబ్బు అవసరం ఉందని ఆమెకు తెలిపాడు. ప్రియుడు అడగటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మహిళ అతను అడిగిన మొత్తాన్ని అన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత అతడు సదరు మహిళ బ్యాంక్ వివరాలు అడిగి తెసుకున్నాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ మహిళ భావించింది. కానీ ఆ మోసగాడు ఏకంగా మహిళ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు కాజేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళ అతనికి ఫోన్ చేస్తే ఆ మోసగాడు ఫోన్ ఎత్తడం లేదు. ఇక ఆ మహిళ స్థానిక క్రిస్టియన్ గంజ్ పోలీసులకు ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో) -
జన సైనికుడి ఘరానా మోసం
-
జన సైనికుడి ఘరానా మోసం
సాక్షి, ప్రత్తిపాడు: తమను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్లో ఆటో కార్మికులు శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. గణేష్ మాటలు నమ్మి రూ.లక్ష ఇరవై వేలు చొప్పున చెల్లించి ఫైనాన్స్ కంపెనీల నుండి డ్రైవర్లు ఆటోలు కొనుగోలు చేశారు. మామిడాడలో శరకణం గణేష్ పెట్టిన ప్లెక్సీ బాధితులు చెల్లించిన సొమ్ములతో జన సైనికుడు గణేష్ ఉడాయించాడు. ఈఎంఐలు చెల్లించాలని ఆటో ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిళ్ళు రావడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు గణేష్ చేసిన అన్యాయంపై ఆందోళనకు దిగారు. గణేష్‌తో పాటు ఆటో ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణాలకు కూడా సబ్సిడీ వస్తుందని సొమ్ములు వసూలు చేసినట్లు గణేష్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో అతడి మాటలు నమ్మి 200 మందిపైగా మోసపోయినట్టు తెలుస్తోంది. జనసేన పేరు చెప్పి తమను నిలువునా ముంచిన గణేష్‌ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ న్యాయం చేయాలి: బాధితులు జనసేన పార్టీ కార్యకర్త గణేష్ చేతిలో మోసపోయిన తమకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జనసేన పార్టీని చూసే తాము డబ్బులు కట్టామన్నారు. గణేష్‌తో పాటు జిల్లా నాయకులు వచ్చి తమను నమ్మించారని వాపోయారు. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని వెల్లడించారు. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు) -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి నారాయణ వద్ద పీఏగా చేస్తున్నానంటూ నిరుద్యోగులను నమ్మబలికాడు. మాజీ మంత్రికి చెప్పి కలెక్టరేట్లోనూ, ప్రభుత్వాసుపత్రులలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ వెనుకాల సెక్యురిటీ కోసం బౌన్సర్లను పెట్టుకుని, పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ నిరుద్యోగులను నమ్మిస్తాడు. వారి కి ఉద్యోగం కోసం అపాయింట్మెంట్ ఆర్డర్లు రెడీ చేయిస్తున్నట్లు హడావుడి చేస్తాడు. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద రూ.15 లక్షలు కాజేసీ ముఖం చాటేస్తున్నాడు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు సోమవా రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పం దన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు గోప్యంగా ఉంచమని కోరారు. వివరాల్లోకి వెళితే... తండ్రి రిటైర్డ్ జడ్జి, తల్లి ప్రభుత్వ వైద్యురాలు రాజమండ్రికి చెందిన మద్దిల దీపుబాబు (దీపు రుషి) మోసాలు చేసి డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడ మాచవరం ప్రాంతంలో జీవించే కుటుంబానికి మధ్యవర్తుల ద్వారా ఆరేడు నెలల క్రితం చేరువయ్యాడు. వారికి ఉద్యోగం అవసరం ఉందని గ్రహించి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. తన తండ్రి రిటైర్డ్ జడ్జి అని, తల్లి గవర్నమెంట్ హస్పిటల్లో వైద్యురాలంటూ చెప్పి వారి వివరాలు ఇచ్చాడు. అంతేకాకుండా సొమ్ము కూడా తన చేతికి ఇవ్వనవసరం లేదని, బ్యాంకు ఖాతాలో వేస్తే సరిపోతుందని, ఆ సొమ్మును తాను తీసుకుని నాటి మంత్రి నారాయణకు అందజేస్తానని హామీ ఇచ్చాడు. దీనికి తోడు వారి నుంచే సెక్రటేరియట్లో సిబ్బందితో మాట్లాడుతున్నట్లు నటించాడు. దీపు బాబు మాటలు నమ్మిన వారు తమకు ఉద్యోగం వస్తుందని భావించారు. మూడు పోస్టులు.. రూ.15 లక్షలు ఒక మహిళ నర్సుట్రైనింగ్ పూర్తి చేయడంతో ఆమెకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.5 లక్షలు గుంజాడు. ఆమె అక్క కుమారుడికి కలెక్టరేట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.5 లక్షలు, వారి బంధువుల్లో పీజీ చదివిన యువతికి కలెక్టరేట్లో ఉద్యోగమని చెప్పి రూ.3.5 లక్షలు వసూలు చేశారు. బ్యాంకు ఖాతాలో వేయించుకోవడమే కాకుండా నగదుగా మరో మూడు లక్షల వరకు తీసుకున్నాడు. ప్రభుత్వం మారిపోయిందంటూ.. డబ్బులు మొత్తం ఇచ్చేసిన తరువాత దీపుబాబు ముఖం చాటేశాడు. ఫోన్ పనిచేయడం లేదంటూ వారికి అందుబాటులోకి రాకుండా తప్పించుకుని తిరగసాగాడు. సోషల్ మీడియాలోని అకౌంట్లు కూడా మార్చేశాడు. అయితే బాధితులు ఏదో విధంగా అతని ఆచూకీ తెలుసుకుని తమ డబ్బు వెనక్కు ఇచ్చేయాలంటూ కోరినా ప్రయోజనం ఉండటం లేదు. కాగా ఉద్యోగం వస్తుందనే ఆశతో తమ ఇళ్లు తాకట్టుపెట్టుకుని, బంగారం విక్రయించుకుని దీపు బాబుకు కట్టామని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోతున్నారు. తమలాగా మరి కొంత మంది బాధితులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
కథువా కుటుంబానికి మరో షాక్
కశ్మీర్ : డిజిటల్ బ్యాంకింగ్ వంటి నూతన పోకడల వల్ల నిరక్షరాస్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వార్త మన కళ్లకు కడుతుంది. గతేడాది జనవరిలో కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. అప్పుడే వారికి మరోక షాక్ తగిలింది. బిడ్డ మరణంతో కుమిలి పోతున్న వారిని ఆదుకోవాడానికి విరాళాలు ఇచ్చారు కొందరు మానవతా వాదులు. కానీ జనాలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే.. అలా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. అది కూడా దర్జాగా బ్యాంక్ ఖాతా నుంచి కొట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతా నుంచి ఖాతాదారునికి తెలియకుండా డ్రా చేశారు. వివరాలు.. కథువా సంఘటన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ ప్రారంభించాయి. అలా వచ్చిన సొమ్మును బాధితురాలి తండ్రితో పాటు వారి కుటుంబానికి చెందిన అస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరు మీద తీసిన జాయింట్ అకౌంట్లో వేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ నుంచి తనకు తెలియకుండా ఎవరో ఏకంగా 10 లక్షల రూపాయలను విత్‌డ్రా చేశారని బాధితురాలి తండ్రి వాపోతున్నాడు. తనకు చదువు రాదని.. ఈ మోసం ఎలా జరిగిందో తనకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అంతేకాక ఈ విషయం గురించి అస్లాం ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు అతడు సరిగా స్పందించలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనకు అతని మీద అనుమానం ఉందని పేర్కొన్నాడు. గత నెల జనవరి నుంచి నేటి వరకు తన అకౌంట్ నుంచి రూ. 22 లక్షలు డ్రా చేశారని తెలిపాడు. వాటిలో ఓ పది లక్షల రూపాయలు మాత్రమే తాను తీసుకున్నానని.. మిగతా మొత్తం గురించి తనకు తెలీదని వాపోతున్నాడు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు తీసుకొచ్చి సొమ్ము డ్రా చేశారని.. వాటిలో అన్ని వివరాలు సరిగా ఉండటంతో సొమ్ము ఇచ్చామన్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు అస్లాం ఖాన్ పేరు మీద జరగ్గా.. మరి కొన్ని ట్రాన్సాక్షన్లు నజీమ్ అనే వ్యక్తి పేరు మీద జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసుంటారని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసు తండ్రికి తలవంపు తెచ్చిన యువకుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఎస్సై కుమారుడు రూ.46 లక్షలు మోసపోయిన ఘటన ఢిల్లీలో చోటు చేసింది. పేరుకు పోలీసు కొడుకైనా సులువుగా సంపాదించడం కోసం అడ్డదారి వెతుక్కున్నాడు. నోట్ల ముద్రణా యంత్రం కొనుగోలు చేయడానికి అప్పు చేసి మరీ రూ.46 లక్షలు సేకరించాడు. తీరా డబ్బు చేతికందగానే యంత్రాన్ని అమ్ముతామన్న ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఇటీవలే ఏఎస్సై కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులు వెతుకులాట చేపట్టారు. వ్రిందావన్‌లో అతన్ని పోలీసులు గుర్తించగా, తన దగ్గరున్న డబ్బు తీసుకుని మోసం చేశారని పోలీసుల ముందు వాపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులను ముంబైకి చెందిన విమల్ రాజేశ్, సూరజ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం పూర్తి దర్యాప్తు కోసం పోలీసు కస్టడీకి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు తమ దగ్గరున్న యంత్రంతో భారత కరెన్సీ నోట్లను ముద్రించవచ్చని చెప్పి ప్రజలను మోసం చేసేవారు. వీరి వెనక పెద్ద ముఠా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘ఇండియన్ ఐడల్’కే టోకరా..
ముంబై: ప్రముఖ టెలివిజన్ సంగీత కార్యక్రమం ఇండియన్ ఐడల్-10తో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సింగర్ అవంతీ పటేల్ (23)ను ఒక సైబర్ నేరగాడు మోసం చేశాడు. బ్యాంక్ ఉద్యోగినంటూ నమ్మించి అవంతీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె సియాన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జార్ఖండ్‌కు చెందిన నిందితుడు జయరంజన్ మండల్ (22) అవంతీకు ఫోన్ చేసి తాను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగినని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్ కార్డు పాస్‌వర్డ్‌లను తెలుసుకున్నాడు. వాటి ద్వారా అవంతీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎమ్, డిజిటల్ వ్యాలెట్లను ఉపయోగించి దాదాపు రూ.1.7 లక్షల వరకూ నగదును డ్రా చేశాడు. కొంతసేపటికి మోసాన్ని గమనించిన అవంతీ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తును ఆరంభించిన పోలీసులు నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అతడి చిరునామా, కొట్టేసిన డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలనూ కనిపెట్టారు. అనంతరం జార్ఖండ్‌లో నిందితుడ్ని పోలీసలు పట్టుకున్నారు. -
దారుణం : అమర జవాను భార్యను దోచేశాడు
భోపాల్: పుల్వామా ఉగ్రదాడిలో 43మంది సీఆర్పీఎఫ్ జవానుల మృతిపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం కొనసాగుతుండగానే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అమర జవాను భార్యను టార్గెట్ చేసిన ఓ దుర్మార్గుడు ప్రభుత్వం ఆమెకిచ్చిన పరిహార సొమ్మును కాజేశాడు. మధ్య ప్రదేశ్‌లోని సెహోర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 2013 శ్రీనగర్‌లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మధ్యప్రదేశ్‌కు సీఆర్పీఎఫ్ జవాను ఓం ప్రకాశ్ మారదానియా అసువులు బాసారు. అయితే ఆయన భార్య కమల్ బాయికి ప్రభుత్వం రూ.8లక్షలను ఇచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్ మీనా అనే వ్యక్తి కమలా బాయిని ఈ నెల (ఫిబ్రవరి) 11న కలిశాడు. తను సీఆర్పీఎఫ్కి చెందిన వ్యక్తినని, అమర జవానుల కుటుంబ సంక్షేమ సమాచారం నిమిత్తం ప్రభుత్వం తనను పంపించిందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం మరో 34లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 8లక్షల రూపాయలను బ్యాంకునుంచి విత్‌డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. అతని మాటల్ని విశ్వసించిన కమలా బాయి ఆ డబ్బులను విత్ డ్రా చేసి వాడికి ఇచ్చింది. అంతే ఇదే అదనుగా భావించిన అతగాడు అక్కడ్నుంచి ఉడాయించాడు. మరోవైపు కమలా బాయి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రతి మూడునెలలకు ఒకసారి అమర జవానుల కుటుంబాన్ని సీఆర్పీఎఫ్ పరామర్శింస్తుందన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడి వుంటారని భావిస్తున్నామన్నారు. ఈ కేసు విచారణలో అటు సీఆర్పీఎఫ్ కూడా తమతో సహకరిస్తోందని సెహోర్ అదనపు ఎస్పీ సమీర్ యాదవ్ వెల్లడించారు. -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
నటి ఇన్నర్‌వేర్‌లతోసహా దోచుకుపోయారు
సాక్షి, ముంబై : నటి మేఘనా నాయుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లో అద్దెకుంటున్న ఓ జంట ఆమెను దారుణంగా మోసం చేశారు. ఈ క్రమంలో వారు ఆమె సామాన్లతో సహా ఉడాయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్ బుక్‌లో తెలియజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నటి మేఘనా నాయుడిక గోవాలో ఓ ఇల్లు ఉంది. దానికి ఆమె ఓ గార్డియన్‌ను నియమించి.. ఆమె మాత్రం ముంబైలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఓ జంట ఆ ఇంట్లో అద్దెకు దిగారు. తాము ముంబైకి చెందిన వారిమని.. న్యూజిలాండ్‌లో పని చేస్తుంటామని... పని మీద గోవాకు వచ్చామని నమ్మబలికారు. అంతేకాదు వారి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా ఇచ్చారు. కానీ, గత కొన్ని నెలలుగా వారు అద్దె చెల్లించలేదంట. అంతేకాదు చెప్పా పెట్టకుండా పారిపోయిన ఆ జంట.. పోతూ పోతూ ఇంట్లోని మేఘనా వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయారంట. ఇన్నర్ వేర్లతోపాటు, సాక్సులను కూడా వదలకుండా వారు తీసుకెళ్లినట్లు ఆమె వివరించింది. వారి ఆధార్, లైసెన్స్‌లు కూడా నకిలీవని తేలింది. అంతేకాదు గార్డియన్‌ను కూడా బురిడీ కొట్టించి ఆమె కొడుక్కి జాబ్ ఇప్పిస్తామని చెప్పించి 85 వేలు వసూలు చేశారంట. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా అప్పులు చేసినట్లు ఫేస్బుక్లో నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించిందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కలియోన్ కా చమన్ మ్యూజిక్ రీమిక్స్ ఆల్బమ్(2002)తో పాపులర్ అయిన మేఘనా.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా పృథ్వీ నారాయణ, విక్రమార్కుడు, పాండురంగడు, పిల్ల జమీందార్ తదితర చిత్రాల్లో ఆమె కనిపించింది. -
యూకే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ
ముంబైలో సూత్రధారిని అరెస్ట్ చేసిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ‘యూకే ఎయిర్‌లైన్స్‌లో మంచి ఉద్యోగం ఉంది. మీ వివరాలు పంపిస్తే ఆఫర్ లెటర్, జాబ్ ఆర్డర్ కాపీలు పంపిస్తాం’ అంటూ ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని సూత్రధారిని రాష్ట్ర సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఉద్యోగాన్వేషణ చేస్తుండగా ముంబైలోని వెస్ట్ అంధేరీకి చెందిన నితిన్ రామ్‌విలాస్ ప్రసాద్ తన స్నేహితుడు సంజీవ్ బోసే, ఒక నైజీరియన్తో కలసి అతన్ని ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ కొట్టించారు. అతన్నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.10.70 లక్షలు కొల్లగొట్టారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు...గతంలోనే నలుగురు ఇతర నిందితులను అరెస్టు చేశారు. అయితే ఆరేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నితిన్ రామ్‌విలాస్ ప్రసాద్‌ను సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ బృందం ముంబైలో తాజాగా అరెస్ట్ చేసింది. ఈ ముఠా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనేక మందిని ఇలాగే మోసగించి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తెలిసిందని సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. లాటరీలు, స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు, ఆన్లైన్ ఉద్యోగ ప్రకటనలు, వర్క్ ప్రమ్ హోం తదితర సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మిమోసపోవద్దని, ఇలాంటి సందేశాలు మొబైల్ ఫోన్లకు వస్తే cybercrimesps@cid.tspolice.gov.in కు ఫిర్యాదు చేయాలని సీఐడీ ఐజీ తెలిపారు. -
ముంబై గ్యాంగ్ ఎలా మాయ చేసిందంటే..
'సుమారు మూడు నెలల క్రితం నాకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అందులో అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి.. మీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. మీ ఇంటికి మరికాసేపట్లో అరెస్ట్ వారెంట్‌తో పోలీసులు వస్తున్నారు. మీరు ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని చెప్పి అని భయానికి గురిచేశాడు. దీంతో ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నేను కంగారుపడిపోయాను' అని కాలిఫోర్నియాలో ఉంటున్న వినోద్ వకిల్ అనే 75 ఏళ్ల వ్యక్తి తాను ముంబై కేటుగాళ్ల చేతిలో ఎలా మోసపోయాననే విషయం మీడియాకు వెల్లడించారు. తరువాత తమను తాము ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్‌కు చెందిన వ్యక్తులుగా చెప్పుకున్న మోసగాళ్లు.. 5000 డాలర్లు చెల్లిస్తే ఈ వ్యవహారాన్ని సెట్ చేస్తామని వకిల్కు హామీ ఇచ్చారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వెంటనే.. లోకల్ స్టోర్‌కు వెళ్లి క్యాష్ కార్డ్‌ను కొనమని చెప్పడంతో.. తాను వృద్దుడినని, ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లడం కష్టమని వకిల్ అనగా.. కేటుగాళ్లు మరుక్షణంలో ఎల్లో క్యాబ్ బుక్ చేసి వకిల్ ఇంటిముందు ఉంచారు. వారుచెప్పినట్లే ఐ-ట్యూన్ క్యాష్ కార్డును కొనుగోలుచేసి దాని కోడ్‌ను ఫోన్లోని వ్యక్తులకు తెలిపాడు వకిల్. అనంతరం లాయర్ ఫీజు కోసం మరో 500 డాలర్లు వెంటనే కావాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తన దగ్గర ఆ డబ్బు లేదని చెప్పిన వకిల్.. జరిగిన విషయాన్ని తన కుమారుడితో చెప్పాడు. అనుమానం కలిగిన అతను ఆరెంజ్ కౌంటీ పోలీసులను సంప్రదించగా ఆ ప్రాంతంలో ఇలాంటి మోసాలు ఇప్పటికే చాలా జరిగాయని చెప్పడంతో అవాక్కయ్యారు. అమెరికాలోని ఇండియన్స్‌ను టార్గెట్ చేసుకొని ముంబై ముఠా సాగించిన నేరాలు ఇటీవల బట్టబయలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బాధితులు ఇప్పుడు వివరాలు వెల్లడిస్తున్నారు. -
నకిలీ వైస్‌చాన్స్‌లర్...
బెంగళూరు: నకిలీ యూనివర్శిటీని ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు విద్యాసంస్థల యాజమాన్యానికి కుచ్చుటోపి పెట్టిన ఘనుడిని బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో ఎంబీయే చదివిన ఈ నిందితుడు ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని తన కార్యాలయంలో ఉద్యోగిగా నియమించుకున్నట్లు తేలడం గమనార్హం. యూనివర్శిటీనే సష్టించాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ లెహర్ 2004లో బెంగళూరుకు చేరుకుని ఇక్కడే ఎంబీఏ పూర్తి చేశాడు. అటుపై కొన్ని ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగానికి ఫుల్‌స్టాఫ్ పెట్టేశాడు. నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఇందుకు తనకు తాను వైస్ చాన్స్‌లర్‌గా ప్రకటించుకున్నాడు. అనంతరం ఇంటర్నెట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలను సంప్రదించి ‘ దేశంలో ఎవరైనా ఇక పై నర్సింగ్, పారామెడికల్ కోర్సులకు సంబంధించి విద్యా సంస్థలను ప్రారంభించాలన్నా, లేక ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సదరు కోర్సులను మొదలు పెట్టాలన్నా తమ యూనివర్శిటీ అనుమతి తప్పని సరి.’ అని పేర్కొనడంతో పాటు ఇందుకు సంబంధించిన నకిలీ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందజేసేవాడు. ఈ పత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ పత్రాలను పోలి ఉండటం గమనార్హం. ఇందుకు ఏదేని విద్యాసంస్థ యాజమాన్యం ప్రతిస్పందించిందంటే సంతోష్ లెహర్ ఇక తన చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు. ప్రతిస్పందించిన వారి వద్దకు ఎర్రబుగ్గ ఉన్న కారులో వెళ్లేవాడు. వారు ఇప్పటికే విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే వివిధ రకాల పేర్లతో పరిశీలనలు జరిపి డబ్బు గుంజేవాడు. ఈ విధంగా ఇప్పటి వరకు కేరళ, తమిళనాడురాష్ట్రాలతోపాటూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, చుట్టుపక్కల ఉన్న పలు విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు. వంచన ఇలా బయటపడింది... ఈ ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్లో బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ నకిలీదంటూ పశ్చిమ బెంగాల్లో ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో గతంలో ఈ వర్శిటీ నుంచి వివిధ రకాల కోర్సులకు అనుమతి పొందిన చెన్నై కు చెందిన వీరిస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షుడు టీసీ.అరివళగన్, సంతోష్ లెహర్‌ను ప్రశ్నించారు. అయితే అవన్నీ గిట్టనివారు చేస్తున్నారని పట్టించుకోనవసరం లేదని సంతోష్ లెహర్ చెప్పి అప్పటికప్పుడు మభ్యపెట్టారు. అటు పై మే 4న వంచన కేసులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ సీఈఓ శ్యామల్ దత్త అరెస్టైన విషయం అక్కడి వార్తా పత్రికలతో పాటు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా సదరు సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నట్లు కూడా తెలిపాయి. విషయం తెలుసుకున్న టీ.పీ అరివళగన్ నగరంలోని పోలీసులను సంప్రదించారు. అప్పటికే ఈ విద్యాసంస్థ విషయమై సమాచారం అందుకున్న నగర పోలీసులు బన్నేరుగట్టలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ సంస్థ శాఖల పై ఏ కాలంలో దాడుల చేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడైన సంతోష్లెహర్ పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శరప్ప ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ చోట్ల గాలింపు చేపట్టారు. చివరికి బంధువుల ఇంట్లో ఉన్న సంతోష్లెహర్ను అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇతను వివిధ సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.78.40 లక్షలను పరిశీలన రుసుం పేరుతో వసూలు చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా ఇతని కార్యాలయం, ఇంటిలో పెద్ద సంఖ్యలో కోర్సుల ప్రారంభానికి సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు, స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులతో పాటు రూ.8.96 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతని పేరు పై ఉన్న బ్యాంకు ఖాతాలోని రూ.27లక్షల నగదుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని సంబంధింత అధికారులకు బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా ఇతని వద్ద ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పనిచేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సంతోష్ లెహర్ మోసంలో సదరు విశ్రాంత ఐఏఎస్ అధికారి పాత్ర తేల్చడానికి పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో ఘరానా మోసం
-
అధికారుల పేర్లతో లక్షలు వసూలు చేసిన గౌస్