‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’ | Man Poses As Doctor From Germany Dupes Woman Of 16 Lakhs | Sakshi
Sakshi News home page

‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’

Published Sun, Jun 14 2020 4:37 PM | Last Updated on Sun, Jun 14 2020 4:49 PM

Man Poses As Doctor From Germany Dupes Woman Of 16 Lakhs - Sakshi

అజ్మీర్‌: సోషల్‌ మీడియాలో మహిళలను పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో మోసగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. అజ్మీర్‌ కొత్రాలోని ప్రగతినగర్ ప్రాంతానికి చెందిన మహిళకు ఫెస్‌బుక్‌లో ఓ వ్యక్తి  ఫ్రెండ్ రెక్వేస్ట్ పంపించాడు. దీంతో సదరు మహిళ ఆ రెక్వేస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసింది. తాను జర్మనీలో డాక్టర్‌గా పనిచేస్తున్నామని  ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫెస్‌బుక్‌లో వారి మధ్య చాటింగ్‌, మాట్లాడుకోవటం కోనసాగింది. కొన్ని రోజులకు అతను ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పాడు. దీంతో ఆమె అతని ప్రేమలో పడింది. అలా ఒక రోజు ఆ వ్యక్తి ఓ ఖరీదైన బహుమతిని ఆమె కోసం పంపాడు. (హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య)

అనంతరం  కొన్ని రోజుల తర్వాత తనకు రూ 1.5 లక్షలు డబ్బు అవసరం ఉందని ఆమెకు తెలిపాడు. ప్రియుడు అడగటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మహిళ అతను అడిగిన మొత్తాన్ని అన్‌లైన్‌లో‌ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. తర్వాత అతడు సదరు మహిళ బ్యాంక్‌ వివరాలు అడిగి తెసుకున్నాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వడాని​కి బ్యాంక్‌ వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ మహిళ భావించింది. కానీ ఆ మోసగాడు ఏకంగా మహిళ అకౌంట్‌ నుంచి రూ.16 లక్షలు కాజేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళ అతనికి ఫోన్‌ చేస్తే ఆ మోసగాడు ఫోన్‌ ఎత్తడం లేదు. ఇక ఆ మహిళ స్థానిక క్రిస్టియన్‌ గంజ్‌ పోలీసులకు ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement