ajmeer
-
‘ప్రేమ పేరుతో రూ.16 లక్షలు మోసం’
అజ్మీర్: సోషల్ మీడియాలో మహిళలను పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో మోసగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. అజ్మీర్ కొత్రాలోని ప్రగతినగర్ ప్రాంతానికి చెందిన మహిళకు ఫెస్‌బుక్‌లో ఓ వ్యక్తి ఫ్రెండ్ రెక్వేస్ట్ పంపించాడు. దీంతో సదరు మహిళ ఆ రెక్వేస్ట్ను యాక్సెప్ట్ చేసింది. తాను జర్మనీలో డాక్టర్‌గా పనిచేస్తున్నామని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫెస్‌బుక్‌లో వారి మధ్య చాటింగ్, మాట్లాడుకోవటం కోనసాగింది. కొన్ని రోజులకు అతను ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పాడు. దీంతో ఆమె అతని ప్రేమలో పడింది. అలా ఒక రోజు ఆ వ్యక్తి ఓ ఖరీదైన బహుమతిని ఆమె కోసం పంపాడు. (హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య) అనంతరం కొన్ని రోజుల తర్వాత తనకు రూ 1.5 లక్షలు డబ్బు అవసరం ఉందని ఆమెకు తెలిపాడు. ప్రియుడు అడగటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మహిళ అతను అడిగిన మొత్తాన్ని అన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత అతడు సదరు మహిళ బ్యాంక్ వివరాలు అడిగి తెసుకున్నాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ మహిళ భావించింది. కానీ ఆ మోసగాడు ఏకంగా మహిళ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు కాజేశాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళ అతనికి ఫోన్ చేస్తే ఆ మోసగాడు ఫోన్ ఎత్తడం లేదు. ఇక ఆ మహిళ స్థానిక క్రిస్టియన్ గంజ్ పోలీసులకు ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో) -
ఆ ఊళ్లో తాళాలు వేస్తారు, కానీ...
జైపూర్: ఓ వైపు నీటి ఎద్దటితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వటం లేదు. ఆజ్మీర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే దొరికిన నీటిని నిల్వ చేసుకుని, వాటికి తాళాలు వేసుకునేంతగా... వైశాలి నగర్ ప్రాంత ప్రజలు డ్రమ్‌లలో నీటిని నిల్వ చేసుకుని వాటికి తాళాలు వేసుకుంటున్నారు. ‘తాగు నీరు మాకు ప్రతీ రోజూ రాదు. వచ్చిన నీటినే అపురూపంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా నీటి దొంగలు ఎక్కువగా చెలరేగిపోతున్నారు. అందుకే తాళాలు వేసుకుంటున్నాం’ అని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ప్రతీ ఏటా ఇలాంటి పరిస్థితులు మాములే అయినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం అది తారాస్థాయికి చేరింది. పరిస్థితికి దర్పణం పడుతున్న ఫోటోలు కొన్ని మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
అజ్మీర్ యాత్రే వారికి చివరిదైంది!
హైదరాబాద్: అజ్మీర్ దర్గా సందర్శనకు వెళ్లిన సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో స్థానికంగా విషాదఛాయులు నెలకొన్నాయి. వారాసిగూడ నివాసి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ సభ్యుడు షకీల్‌ఖాన్, తన భార్య జుబేదాబేగం, కుమారులు ఉమాయాన్ఖాన్, సైఫ్‌ఖాన్, యాజాఖాన్, కుమార్తె దానియాబేగంతో పాటు వారింట్లో అద్దెకుండే సయ్యద్ షకీల్ కుటుంబం అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అజ్మీర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న టాటా సుమోను భారీ వాహనం ఢీ కొట్టింది. దీంతో షకీల్‌ఖాన్ చిన్న కుమారుడు మహమ్మద్ సైఫ్‌ఖాన్ (7)తో పాటు సయ్యద్ షకీల్ (45) అతని కుమార్తెలైన మిజ్వా (1), ఉమేరా (7) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ షకీల్‌ఖాన్, జుబేదాబేగం, యజాఖాన్, దానియాబేగం, నజీమా బేగం, ఖాజాబేగం, ఉమాయాన్ఖాన్ అజ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున వారాసిగూడలోని వారి నివాసాలకు తరలి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురికి ఆదివారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తవుతుందని సోమవారం సాయంత్రం లోపు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బంధువులు తెలిపారు. అంతా అయోమయంగా ఉంది: షకీల్‌ఖాన్ ప్రమాదంలో గాయాలపాలై కన్న కొడుకును కొల్పోయిన షకీల్‌ఖాన్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ తమ సుమోను భారీ వాహనం ఢీకొందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదని చెప్పారు. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రి ఐసీయుూలో ఉన్నానని, తమ వాళ్ల సమాచారం వైద్యులు చెప్పడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. -
అజ్మీర్‌లో డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆదివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లారు. అక్కడి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ రహమతుల్లా అలయ్ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. సోమవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేను కలసి అజ్మీర్‌లో తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరనున్నట్లు తెలిసింది.