నీటి డ్రమ్‌లకు తాళాలు వేసిన దృశ్యం
జైపూర్: ఓ వైపు నీటి ఎద్దటితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వటం లేదు. ఆజ్మీర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే దొరికిన నీటిని నిల్వ చేసుకుని, వాటికి తాళాలు వేసుకునేంతగా... వైశాలి నగర్ ప్రాంత ప్రజలు డ్రమ్‌లలో నీటిని నిల్వ చేసుకుని వాటికి తాళాలు వేసుకుంటున్నారు. ‘తాగు నీరు మాకు ప్రతీ రోజూ రాదు. వచ్చిన నీటినే అపురూపంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా నీటి దొంగలు ఎక్కువగా చెలరేగిపోతున్నారు. అందుకే తాళాలు వేసుకుంటున్నాం’ అని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ప్రతీ ఏటా ఇలాంటి పరిస్థితులు మాములే అయినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం అది తారాస్థాయికి చేరింది. పరిస్థితికి దర్పణం పడుతున్న ఫోటోలు కొన్ని మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment