మోసం... సాధారణంగా ఇది నమ్మకాన్ని ఆనుకుని ఉంటుందేమో! అందుకే నమ్మిన వ్యక్తులనే ఎదుటివారు నయవంచన చేస్తుంటారు. మోసాలకు పాల్పడేవారు ఎదుటివారి మానసిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారు. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఎంతటి సంపన్నులైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో లెక్కకు అందనంత బిలియన్ డాలర్లకు సంబంధించిన మోసాల వార్తలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, ఎఫ్‌టీఎక్స్ (బహామాస్-ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్) వ్యవస్థాపకుడు. ఈయన తన కంపెనీ పెట్టుబడిదారులుగా ప్రముఖులను ఆకర్షించి, వారి చేత పెట్టుబడులు పెట్టించారు. ఈ ప్రముఖుల జాబితాలో టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ తదితరులు ఉన్నారు. బిలియనీర్ అయిన బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది. ఇప్పుడు ఎఫ్‌టీఎక్స్ దివాలా కంపెనీ. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మోసానికి సంబంధించిన పలు కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.
ఎలిజబెత్ హోమ్స్ చేసిన పని ఇదే..
ఇదే కోవలోనే ఎలిజబెత్ హోమ్స్ కథ కూడా ఉంటుంది. హోమ్స్ అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా పేరొందింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె నికర విలువ ఆస్తుల $4.5 బిలియన్లు. ప్రస్తుతం పనిచేయని ఆమె సంస్థ థెరానోస్‌లో ఆమె 50% వాటా కలిగివుంది. థెరానోస్ కంపెనీ పెట్టుబడిదారుల జాబితాలో రూపర్ట్ ముర్డోక్, వాల్టన్ కుటుంబంతో సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. 2022లో ఆమెపై వచ్చిన ఆరోపణలలో దోషిగా తేలిన నేపధ్యంలో ఆమె యూఎస్ నుండి పారిపోయే ప్రయత్నంలో హోమ్స్ మెక్సికోకు వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్,హోమ్స్‌లు తెలివైనవారిని ప్రముఖులను ఎలా మోసం చేశారు? వీరు నైపుణ్యం కలిగిన మోసగాళ్ల మాదిరిగానే, ఎదుటివారి భావోద్వేగాలను, వారి అవసరాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి.
భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి..
ఇలా మోసపోతున్న బాధితుల జాబితాలో అమాయకులు, వయసుపైబడినవారు సాధారణంగా కనిపిస్తారు. మోసాలకుగురయిన బాధితుల డేటా భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా నిశితంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది. దీనిపై పరిశోధకులు చేపట్టిన పరిశోధనలలో అధునికులు, బాగా చదువుకున్నవారు, యువకులందరూ స్కామ్‌లకు గురవుతారని వెల్లడయ్యింది. మోసగాళ్ళు నిర్దిష్ట జనాభాను తమ లక్ష్యంగా చేసుకుంటారు.
ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగర్భం.. లోపల ఏముందో చూసేసరికి..
మితిమీరిన నమ్మకంతోనే..
దుర్బలత్వంతో కూడిన మితిమీరిన నమ్మకమే మోసాలకు ప్రధాన కారకం అని కూడా పరిశోధనలో కనుగొన్నారు. ఒక రంగంలో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం మరో రంగంలో వీక్‌గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారు. ఉదాహరణకు బెర్నీ మాడాఫ్.. ఆర్థిక నిపుణులు కాని సంపన్నులను, బాగా చదువుకున్న వృత్తిపరమైనవారిని సులభంగా మోసం చేశారని పరిశోధనలో తేలింది. చాలామంది విపరీతమైన నమ్మకం కారణంగానే స్కామ్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు.
దీనికి ఉదాహరణ లాటరీ విజేతలు వీరే నంటూ వచ్చే ప్రకటనలు. ఇవి ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చాలామంది వీటి బారిన పడి మోసపోతుంటారు. సాధారణంగా మోసగాళ్లు ఇతరులలో భవిష్యత్ భయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తారు. దీంతో మోసగాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దీంతో వారు ఎదుటివారిలో తమపై మరింత నమ్మకం కలిగేలా వాతావరణం సృష్టిస్తారు.
సెలబ్రిటీలు- సామాజిక గుర్తింపు
సోషల్ ప్రూఫ్ అనేది మనస్తత్వవేత్త రాబర్ట్ సియాల్డిని రూపొందించబడిన పదం. వినియోగదారులు.. ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుని, దానికి ప్రతిస్పందనగా తాము ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. దీనినే సోషల్‌ప్రూప్ అనవచ్చు. సెలబ్రిటీలు తమ సామాజిక గుర్తింపును ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పలువురు ప్రముఖులు ఆధునిక సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉత్పత్తి లేదా సేవల ప్రభావంపై అమితమైన నమ్మకం కలిగివుంటారు.
క్రిప్టోకరెన్సీ బారినపడి..
అక్టోబర్ 2022లో కిమ్ కర్దాషియాన్.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రచురించినందుకు $250,000 చెల్లించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆమె యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి $1.26 మిలియన్ సెటిల్‌మెంట్ చెల్లించడానికి అంగీకరించారు. ఆమె నెలకొల్పిన సంస్థ ఎథేరియం మ్యాక్స్ బారినపడి సెలబ్రిటీలు మడోన్నా, జస్టిన్ బీబర్, డీజే ఖలీద్, పారిస్ హిల్టన్, గ్వినేత్ పాల్ట్రో, స్నూప్ డాగ్, సెరెనా విలియమ్స్, జిమ్మీ ఫాలన్‌లు మోసపోయారని తేలింది.
అప్రమత్తతతో నేరాలకు అడ్డుకట్ట
పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే ఆర్థికంగా దిగువస్థాయిలో ఉన్నవారి కంటే ధనవంతులను లేదా సంస్థలను మోసం చేయడం చాలా సులభం. నిపుణులు మోసాలకు గురైన వారిని ఇంటర్వ్యూ చేయగా వారు ‘బ్రాండ్’కు అమితంగా ప్రభావితమయ్యారని, మోసపోయినా వారు బహిర్గతం చేయడానికి, అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలింది. సోషల్ మీడియా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడి మోసాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి ఎందుకు పంపిస్తున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment