సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్‌తో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం నంబర్‌కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు.
వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..)
Comments
Please login to add a commentAdd a comment