సూర్యాపేట : పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని కలెక్టర్ చిరంజీవులు హామీ ఇచ్చారు. శనివారం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయంలో పులిచింతల ముంపుగ్రామాల ప్రజలతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపుగ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ నుంచి నిధులు విడుదలయ్యాయని, వాటితో పలు గ్రామాల్లో పనులు చేపట్టామన్నారు. ముంపుగ్రామాల్లో భూ సేకరణ సమస్య ఉందని, ఆ సమస్యను కూడా త్వరలో అధిగమిస్తామని తెలిపారు. బాధితులకు పరిహారం సరిపడా అందలేదని తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ముంపు ప్రాంతాల్లో దేవాలయాల, లిప్టుల నిర్మాణాలకు టెక్నికల్ కమిటీని వేసినట్టు పేర్కొన్నారు. నిర్వాసితులు ఎవరు కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకోనుందని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు నిరంజన్, దేవకరుణ, గిరిధర్, హిమశంకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
పులిచింతల ముంపు బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం : కలెక్టర్
Published Sun, Nov 23 2014 3:52 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement