సాక్షి, న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రాంలో మహిళా మోడల్‌గా నమ్మబలకడంతో పాటు ఉద్యోగాల ఆశ చూపి పలువురు మహిళలను మోసగించిన ప్రబుద్ధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మాం చంద్ అలియాస్ దీపక్ తనను మహిళా మోడల్‌గా చెప్పుకుంటూ తాను ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నానని ఓ వెబ్ సిరీస్ కోసం కొత్త మోడల్స్ కోసం అన్వేషిస్తున్నామని నమ్మబలికాడని పోలీసులు వెల్లడించారు. రాశీ గోయల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో సంప్రదించారని, ఆమె ఓ మోడల్‌గా తనను పరిచయం చేసుకున్నారని బాధితురాలు ఆరోపించారు. చదవండి : మొబైల్ ఫోన్ల ఈఎమ్‌ఐ పేరిట భారీ మోసం
తమ వెబ్‌సిరీస్ కోసం కొత్త మోడల్స్ కోసం చూస్తున్నామని నమ్మబలికిందని చెప్పారు. ఆడిషన్స్ కోసం నగ్నచిత్రాలు పంపగలరా అని కోరినట్టు తెలిపారు. రాశీ గోయల్‌కు తాను నగ్నచిత్రాలను పంపానని, పదేపదే అలాంటి ఫోటోలను పంపాలని కోరడంతో ఇన్‌స్టాగ్రాంలో ఆ ఖాతాను బ్లాక్ చేశానని ఫిర్యాదిదారు వెల్లడించారు. ఆ తర్వాత తనకు ఇద్దరు వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారు వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా సుల్తాన్‌పురిలోని ఇంటి నుంచి నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఓ కేసులో హరియాణాలోని హిసార్‌లో నిందితుడు ఓసారి అరెస్ట్ అయ్యాడని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment