సాక్షి, న్యూఢిల్లీ: ఏఎస్సై కుమారుడు రూ.46 లక్షలు మోసపోయిన ఘటన ఢిల్లీలో చోటు చేసింది. పేరుకు పోలీసు కొడుకైనా సులువుగా సంపాదించడం కోసం అడ్డదారి వెతుక్కున్నాడు. నోట్ల ముద్రణా యంత్రం కొనుగోలు చేయడానికి అప్పు చేసి మరీ రూ.46 లక్షలు సేకరించాడు. తీరా డబ్బు చేతికందగానే యంత్రాన్ని అమ్ముతామన్న ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఇటీవలే ఏఎస్సై కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులు వెతుకులాట చేపట్టారు.
వ్రిందావన్‌లో అతన్ని పోలీసులు గుర్తించగా, తన దగ్గరున్న డబ్బు తీసుకుని మోసం చేశారని పోలీసుల ముందు వాపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులను ముంబైకి చెందిన విమల్ రాజేశ్, సూరజ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం పూర్తి దర్యాప్తు కోసం పోలీసు కస్టడీకి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు తమ దగ్గరున్న యంత్రంతో భారత కరెన్సీ నోట్లను ముద్రించవచ్చని చెప్పి ప్రజలను మోసం చేసేవారు. వీరి వెనక పెద్ద ముఠా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment