
ప్రతీకాత్మక చిత్రం
హస్తినాపురం(హైదరాబాద్): విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకున్న అగంతకులు అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 40 వేలు స్వాహా చేశారు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. క్రిస్టియన్ కాలనీకి చెందిన రచ్చ పట్టాభి(67) ఈనెల 4న ఊబర్ క్యాబ్ బుక్ చేశాడు. ఎంతకూ క్యాబ్ రాకపోవడంతో రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత క్యాన్సిల్ చార్జీల చెల్లించాలని మెసేజ్ రావడంతో వచ్చిన నంబర్‌కు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను ఊబర్ కస్టమర్ కేర్ నుంచి మెసేజ్ పంపానని చెప్పి ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. మాటల్లో పెట్టి ఎస్‌బీఐ కార్డు పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. 5 నిమిషాల వ్యవధిలో మూడు దఫాలుగా పట్టాభి ఖాతా నుంచి మొత్తం రూ.40 వేలు డ్రా చేశారు. తర్వాత మోసపోయానని గ్రహించిన పట్టాభి శనివారం వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment