Customer care centers
-
ఉద్యోగులను తొలగించలేదు: ఫోన్‌పే
ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌ను తొలగించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని పేర్కొంది. అయితే కస్టమర్ సపోర్ట్ విభాగంలోని ఉద్యోగులు తగ్గిపోవడానికి కారణాన్ని తెలియజేసింది.ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు తగ్గించినట్లు తెలిపాయి. దీనిపై కంపెనీ తాజాగా స్పందించింది. ‘ఏఐ, ఆటోమేషన్ వల్ల కంపెనీలో ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐను వాడుతున్నాం. అదే సమయంలో కొత్తగా ఆ విభాగంలో స్టాఫ్‌ను నియమించలేదు. అలాగని ఉన్నవారిని బలవంతంగా తొలగించలేదు. ఐదేళ్ల కిందట ఈ విభాగంలో ఉన్న సిబ్బంది వివిధ కారణాలతో ఉద్యోగం మానేశారు. అయితే కొత్త స్టాఫ్‌ను నియమించకపోవడం వల్ల వీరి సంఖ్య తగ్గినట్లు కనిపింది’ అని ఫోన్‌పే ప్రకటన విడుదల చేసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో కొత్తగా కొలువులు సృష్టించే అవకాశం ఉండడం లేదు. ఏఐ వల్ల ఈ విభాగంలో పని చేస్తున్నవారు ఇతర రంగాలకు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ సెక్టార్లో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది.ఫోన్‌పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్పీఎస్-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.కంపెనీ వార్షిక నివేదికలో తెలియజేసిన వివరాల ప్రకారం కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 400కు చేరింది. ఇది గతంలో 1,100గా ఉండేది. ఈ విభాగంలో 90 శాతం ఏఐను వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశం అంతటా సంస్థలో దాదాపు 22 వేల ఉద్యోగులున్నట్లు పేర్కొంది. 1,500 కంటే ఎక్కువ మంది అగ్రశ్రేణి ఇంజినీర్లకు కంపెనీ ఉపాధి కల్పిస్తోందని చెప్పింది. ఫోన్‌పే ఆగస్టులో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,064 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.2,914 కోట్లగా నమోదైంది. అంటే ఏడాదిలో 74 శాతం వృద్ధిని సాధించినట్లయింది.ఇదీ చదవండి: పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమాఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. ఏమొచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో ఏమి కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుని, ఉన్న చోటే కావలసిన వస్తువులను పొందుతున్నారు. ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో బట్టల దగ్గర నుంచి ల్యాప్టాప్స్ వరకు అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 'అథర్వ ఖండేల్వాల్' ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్ బుక్ కోసం ఆర్డర్ చేసాడు. అయితే అతనికి డెలివరీ విషయంలో కొంత ఆలస్యం జరిగింది, కావున అతడే నేరుగా ఫ్లిప్‌కార్ట్ హబ్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకున్నాడు. అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఎందుకంటే అందులో మ్యాక్ బుక్ బదులు 'బోట్ స్పీకర్స్' ఉన్నాయి. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? 🆘 Unbelievable experience with @Flipkart! Ordered a Macbook M1 worth 76,000 INR, but received cheap speakers instead 😡🎧 Despite solid evidence of their own delivery executive mishandling the situation, they're denying refund under 'no returns' policy. All Proves Attached 👇 — atharva khandelwal (@atharva_1913) August 21, 2023 నిజానికి అతడు బుక్ చేసుకున్న యాపిల్ మ్యాక్ బుక్ ధర రూ. 76000. అయితే అతనికి కేవలం రూ. 3000 విలువైన బోట్ స్పీకర్స్ రావడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయాడు. అతనికి జరిగిన నష్టాన్ని రీఫండ్ చేయాలనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే వారు ఓపెన్ బాక్స్‌కు వర్తించే నో రీఫండ్ పాలసీ ప్రకారం, రీఫండ్ ఇవ్వడం కుదరదని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబందించిన సమాచారం అతడు ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ అమౌంట్ రీఫండ్ చేస్తుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. pic.twitter.com/FVjTm1rKkj — atharva khandelwal (@atharva_1913) August 21, 2023 -
హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది
కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో బోగస్‌వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్‌చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొరియర్ నంబర్ కోసం వెతికితే... కాజీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్‌లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్‌ను కొరియర్ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్ రాకపోయేసరికి ఇంటర్నెట్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి దానికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్ చేయడానికి రూ.2 ఫోన్ ద్వారా చెల్లించాలని కోరారు. మీకు రాము అనే కొరియర్ బాయ్ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్ చేరుస్తామంటూ ఓ లింక్ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్ ఖాదర్ ఆ లింక్‌ను క్లిక్‌చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్ సర్వీస్ అడ్రస్ లేకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి అవాక్కయ్యాడు. తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్లైన్ కేసులు ఒక కాజీపేట పీఎస్‌లోనే పాతికకు పైగా నమోదయ్యాయి. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం. -
31,170 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్ మోసాలు!
న్యూఢిల్లీ: కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్‌లుగా పేర్కొంటూ, మోసపూరిత కార్యకలాపాలకు తెగబడుతున్న 31,179 ఫోన్ నెంబర్లను గుర్తించినట్లు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ శుక్రవారం తెలిపింది. ఈ నంబర్లను విశ్లేషించి, వాటిలో 56 శాతం అంటే 17,285 భారతీయ ఫోన్ నంబర్లు కాగా, మిగిలినవి నాన్–ఇండియన్ నెంబర్లుగా గుర్తించినట్లు పేర్కొంది. ‘‘క్లౌడ్‌సెక్ భారతదేశంలో విస్తృతమైన స్కామ్‌ను డీకోడ్ చేసింది. ఇందులో వినియోగదారులను మోసం చేయడానికి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను ఉపయోగించడం జరుగుతోంది. ఈ స్కామ్‌లో ప్రముఖ బ్రాండ్ల కోసం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టించి వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం, సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయడానికి సందేహించని వినియోగదారులను మోసగించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రచారం ఇలా... : భారత దేశ ఫోన్ నంబర్లగా గుర్తించిన వాటిలో 80 శాతం ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయని, అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. 88 శాతం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు ఫేస్బుక్ పోస్ట్‌లు, ప్రొఫై ల్స్, పేజ్ ద్వారా ప్రచారంలో ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలినట్లు వివరించింది. దాదాపు ఆరు శాతం మంది ట్విట్టర్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. 2 శాతం మంది సులేఖ, గూగుల్‌ను తమ ఫోన్ నెంబర్లను ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై తొలి గురి... మోసాలకు ఎంచుకుంటున్న రంగాల్లో మొదటి వరుసలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్ (59.4 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా హెల్త్‌కేర్ (19.2 శాతం), టెలికమ్యూనికేషన్స్ (10.5 శాతం) ఉన్నాయి. 23 శాతం నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు నమోదయిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. అక్రమ కార్యకలాపాలకు కోల్‌కతాకు ప్రధాన కేంద్రంగా ఉంది. 9.3 శాతం చొప్పున వరుసగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. -
కస్టమర్లకు రియల్ మీ మరింత మెరుగైన సేవలు
న్యూఢిల్లీ: రియల్ మీ తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ‘రియల్ మీ కేర్ సర్వీస్ సిస్టమ్’ను ప్రారంభించింది. కంపెనీ రెండో దశ వృద్ధిలోకి అడుగు పెట్టిందని, దీంతో కస్టమర్ల అంచనాలకు మించి సేవలను అందించనున్నట్టు రియల్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కస్టమర్లు ఆన్లైన్, ఆఫ్‌లైన్ టచ్ పాయింట్ల ద్వారా, వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా, 1,000కి పైగా సర్వీస్ సెంటర్ల రూపంలో సులభంగా సేవలను పొందొచ్చని తెలిపింది. సోషల్ మీడియా, ఈమెయిల్, వాయిస్, వాట్సాప్, వెబ్ చాట్‌పై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
మీ చెత్త సర్వీస్ భరించడం నా వల్ల కాదు.. చివరికి ఏం జరిగిందంటే?
దేశ ప్రజలు ముఖ్యంగా టూ వీలర్ ఉన్న వారిలో నూటికి తొంభై మంది ఎలక్ట్రిక్ బైకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేశారు. కానీ నాణ్యతా లోపాలు, సమస్యకు పరిష్కారం చూపని కస్టమర్ కేర్ సర్వీసులతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కస్టమర్ ఈవీ స్కూటర్ వల్ల ఎదురవుతున్న ఒత్తిడి తట్టుకోలేక పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తమిళనాడులో అంబుర్కి చెందిన పృధ్విరాజ్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. 2022 జనవరిలో ఓలా స్కూటర్ అతనికి డెలివరీ అయ్యింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున సంతోషం అతనిలో ఎక్కువ కాలం నిలవలేదు. బ్యాటరీ మేనేజ్మెంట్లో లోపాల కారణంగా ఆ స్కూటర్ దారి మధ్యలోనే ఆగిపోయేది. కంపెనీ సింగిల్ ఛార్జ్‌తో 181 కిలోమీటర్ల దూరం వస్తుందని చెప్పగా ఎప్పుడూ 60 కి.మీలకు మించి వచ్చింది లేదని పృధ్విరాజ్ అంటున్నాడు. 90 పర్సంట్ చూపించే బ్యాటరీ క్షణాల్లోనే జీరోకి చేరుకునేది. దీంతో ఎన్నోసార్లు నడిరోడ్డుపై నిలబడి పోవాల్సి వచ్చేది. కస్టమర్ కేర్ విఫలం ఈ క్రమంలో అనేక సార్లు తన స్కూటర్ సమస్యను పరిష్కరించాలంటూ పృధ్విరాజ్ ఓలా కస్టమర్ కేర్‌ను వేడుకున్నాడు. వందల కొద్ది కాల్స్, మెసేజ్ చేశారు. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. ఆఖరికి సోషల్ మీడియాలో ఓలా సీఈవో భవీష్ అగర్వాల్‌ను ట్యాగ్ చేస్తేనే అప్పుడప్పుడు రెస్పాన్స్ వచ్చేది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరికేది కాదు. ఒత్తిడి భరించలేక ఇలా అనేక ఇబ్బందుల నడుమ ఓలా స్కూటర్‌తో ప్రయాణం చేస్తున్నాడు పృధ్విరాజ్. ఈ క్రమంలో 2022 ఏప్రిల్ 26న ఓలా స్కూటర్‌తో బయటకు వెళ్లగా దారి మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి వాహనం ఆగిపోయింది. తనకు తక్షణ సాయం అందివ్వాలంటూ ఎంతగా వేడుకున్నా ఓలా కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన రాలేదు. నడిరోడ్డులో అది ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఆగిపోయిన బైకుతో గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం రాకపోవడంతో పృధ్విరాజ్లో ఆక్రోషం కట్టలు తెంచుకుంది. నాలుగు నెలలుగా పడుతున్న ఇబ్బందులకు ఏదో రకంగా పులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. దీంతో రెండు లీటర్ల పెట్రోలు కొనుక్కుని వచ్చి ఓలా స్కూటర్‌పై పోసి ఆ తర్వాత నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న స్కూటర్‌ను వీడియో తీశాడు. దృష్టి పెట్టండి ఓలా స్కూటర్‌తో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఓలా కస్టమర్ కేర్ స్పందించిన తీరును ఏకరువు పెడుతూ ట్విటర్లో ఫోటోలు, స్క్రీన్‌షాట్స్‌తో సహా షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాటరీ పేలిపోవుడు సమస్యలకు తోడు కొత్తగా కస్టమర్ సపోర్ట్ అందివ్వడంలోనూ ఈవీ సంస్థలు విఫలమవుతున్నాయనే అభిప్రాయం నెలకొంటుంది. ఇప్పటికైనా ఈవీ సంస్థలు వాహనాల నాణ్యత, కస్టమర్ సపోర్ట్‌పైన దృష్టి పెడితే మంచిది. @OlaElectric @Hero_Electric @atherenergy @bhash awaited for long time frustrated with your idiotic service it’s show time thank u pic.twitter.com/pFNGSEkySw — Prithv Raj (@PrithvR) April 26, 2022 చదవండి: మా దగ్గర డబ్బులు తీసుకుని.. మా ఇబ్బందులు పట్టించుకోరా ? -
ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..
హస్తినాపురం(హైదరాబాద్): విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకున్న అగంతకులు అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 40 వేలు స్వాహా చేశారు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. క్రిస్టియన్ కాలనీకి చెందిన రచ్చ పట్టాభి(67) ఈనెల 4న ఊబర్ క్యాబ్ బుక్ చేశాడు. ఎంతకూ క్యాబ్ రాకపోవడంతో రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత క్యాన్సిల్ చార్జీల చెల్లించాలని మెసేజ్ రావడంతో వచ్చిన నంబర్‌కు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను ఊబర్ కస్టమర్ కేర్ నుంచి మెసేజ్ పంపానని చెప్పి ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. మాటల్లో పెట్టి ఎస్బీఐ కార్డు పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. 5 నిమిషాల వ్యవధిలో మూడు దఫాలుగా పట్టాభి ఖాతా నుంచి మొత్తం రూ.40 వేలు డ్రా చేశారు. తర్వాత మోసపోయానని గ్రహించిన పట్టాభి శనివారం వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు -
డబ్బులు పోయాయని కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!
ముంబై: మీరు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి కాల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. లేకపోతే, నెరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతిలో మోసాలకు చేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచించిన సైబర్ నేరాల రేటు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి గూగుల్‌లో కనిపించిన కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే ఒక సీనియర్ సిటిజన్ 11 లక్షలకు పైగా మోసపోయినట్లు ముంబై పోలీసులు నిన్న(జనవరి 15) తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలో అంధేరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత ఏడాది జూలైలో ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసింది. పిజ్జా ఆర్డర్ కోసం ఫోన్లో నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు ఆమె రూ.9,999 కోల్పోయింది. అదేవిధంగా అక్టోబర్ 29న ఆన్లైన్లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా మళ్లీ రూ.1,496 నష్టపోయినట్లు ఆమె తెలిపారు. ఈ రెండు సందర్భాల్లో డబ్బులు పోవడంతో వాటిని తిరిగి పొందడం కోసం ఆ మహిళ గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్‌కు కాల్ చేసింది. ఆమెకు కాల్ చేసిన వ్యక్తి నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ వ్యక్తిగా నటించాడు. ఆ నకిలీ వ్యక్తి డబ్బులు తిరిగి పొందటం కోసం మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆమె తను చెప్పిన విధంగానే చేసింది. కానీ, అది ఒక నకిలీ యాప్. ఆ యాప్‌లో నమోదు చేసిన ఖాతానెంబర్, పాస్వవర్డ్, ఓటీపీ వివరాలు అన్నీ మోసాగాళ్ల చేతకి చిక్కాయి. దీంతో రెచ్చిపోయిన మోసాగాళ్లు గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఆ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.78 లక్షలు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసం అంత సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 420 ఇతర నిబంధనల కింద ఆ మోసాగాళ్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ఎలన్ మస్క్‌కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్!) -
కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
మీ బ్యాంక్ అకౌంట్ గురించి తెలుసుకోవాలని కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? అందుకోసం గూగుల్‌లో దొరికిన బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అమెరికాలో అకౌంటెంట్‌గా పనిచేసి నావీ ముంబైలో స్ధిరపడ్డ 73ఏళ్ల వృద్దుడు ఎస్బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి రూ.4.02లక్షల్ని పోగొట్టుకున్నాడు.నావీ ముంబై ఖర్ఖర్ పోలీసుల కథనం ప్రకారం..నావీ ముంబైలో ఉండే వృద్దుడు తన డెబిట్ కార్డును యాక్టీవేట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే గత నెల డిసెంబర్ 25న గూగుల్‌లో సెర్చ్‌చేసి 'ఎస్బీఐ డెబిట్ కార్డ్ హెల్ప్' అని ట్యాగ్ చేసిన నెంబర్‌కు కాల్ చేశాడు. అవతలి నుంచి 'మై నేమే ఈజ్ మనీష్ గుప్తా..హౌ కెన్ ఐ హెల్ప్ యూ' అంటూ మాట కలిపాడు. దీంతో వృద్దుడు తన బ్యాంక్ డెబిట్‌కార్డ్‌ను యాక్టీవేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు, అందుకు సాయం చేయాలని కోరాడు. మనీష్ గుప్తా..అతని ఫోన్‌కు రిమోట్యాక్సెస్ ఇవ్వాలని, ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయాలని సూచించాడు. మనీష్ చెప్పినట్లే ఎనీడెస్క్ ఓపెన్ చేశాడు. వెంటనే నిందితుడు బాధితుడి అకౌంట్ డీటెయిల్స్ ను సేకరించాడు. అనంతరం బ్యాంక్ డెబిట్ కార్డ్ యాక్టీవేషన్ చేసే సమయంలో సర్వర్ చాలా స్లోగా ఉందని, డిసెంబర్ 27న ప్రాసెస్ చేస్తానని నమ్మించాడు. నిందితుడు చెప్పిన మాటలు నిజమేనని బాధితుడు నమ్మాడు. సీన్ కట్ చేస్తే సదరు సైబర్ నేరస్తుడు బాధితుడి అకౌంట్ నుంచి పలు మార్లు ట్రాన్సాక్షన్లు నిర్వహించి మొత్తం రూ.4.02 లక్షల్ని కాజేశాడు. అదే సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు షాక్ తిన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. చదవండి: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..! -
కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ. 1.72 లక్షలు మాయం
హిమాయత్‌నగర్: ఫోన్‌పేలో డబ్బులు కట్ అయ్యాయని కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. ఉన్న వాటిని లూటీ చేశారని నగరవాసి ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరవాసి ఫోన్‌పే నుంచి కొంత డబ్బులు కట్ అయ్యాయి. తాను ఎవరికీ పంపకుండా ఇలా కట్ అవ్వడంపై తెలుసుకునేందుకు గూగుల్‌లో కనిపించిన ఫోన్‌పే కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేశాడు. వారు చెప్పిన విధంగా బ్యాంకు వివరాలు అన్నీ చెప్పడంతో అకౌంట్లో నుంచి రూ. 1.72 లక్షలు స్వాహా చేశారు. బజాజ్ ఫైనాన్స్ పేరుతో... బజాజ్ కార్డుపై లోను వచ్చిందని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని నగర వాసి ఒకరు సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి తాను బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నానని కాల్ చేశాడు. మీ కార్డుపై రూ. 5 లక్షల రుణం మంజూరైందన్నాడు. అది మీ అకౌంట్‌కు రావాలంటే డాక్యుమెంట్స్‌కి కొంత ఖర్చు అవుతుందన్నాడు. దీనికి సరే అనడంతో పలు దఫాలుగా రూ. 2.70 లక్షలు చెల్లించాడు. ఆపై రుణం రాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్ తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
కొంపముంచిన గూగుల్ సెర్చ్.. క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మార్చుదామనుకుంటే..
హైదరాబాద్: క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ యువతి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ తెలిపిన వివరాలు. బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన సయ్యద్ గుల్నార్ (21) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న క్రెడిట్‌కార్డు ఈఎంఐ యొక్క డ్యూ డేట్‌ను మార్చడానికి గూగుల్‌లో సెర్చ్ చేయగా 7718320995 అనే ఫోన్ నెంబరు కనిపించింది. వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా కాల్ కట్ అయింది. కొద్ది సేపటి తరువాత అదే నెంబర్ నుంచి ఓ వ్యక్తికి తనకు తానుగా పరిచయం చేసుకొని హిందీలో మాట్లాడాడు. ఈమె ఈఎంఐ డ్యూ డేట్ మార్చాలని తెలిపింది. దానికి ఎనీ డెస్క్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో వచ్చిన కోడ్‌ను చెప్పాలని కోరగా అదే విధంగా చెయ్యగా స్లైస్ కార్డు నుంచి 19,740 రూపాయలు కట్ అయ్యాయి. మళ్లీ ఫోన్ చెయ్యగా పనిచేయలేదు. కొంతసేపు తర్వాత వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి కలకత్తా నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన యువతి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (చదవండి: వీడని మూఢత్వం ... పల్లెల్లో యథేచ్ఛగా క్షుద్ర పూజలు!!) -
అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్‌కు రూ.550 రీచార్జ్ చేయించారు. ఆ మొత్తం యాడ్ కాకపోవడంతో ఆ సర్వీస్ ప్రొవైడర్ సంస్థను సంప్రదించడానికి కస్టమర్ కేర్ నెంబర్ కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో కనిపించిన ఓ నెంబర్‌కు కాల్ చేయగా... ఆ మొత్తం రీఫండ్ చేస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతా వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి రూ.54,500 కాజేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఈ పంథాలో టోకరా వేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతి నెలా కనిష్టంగా రూ.20 లక్షల వరకు టోకరా వేస్తున్నారు. బోగస్ వివరాలతో సిద్ధం చేసి... ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రోనగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యవతకు కమీషన్ ఆశ చూపుతున్న సైబర్ నేరగాళ్లు వారి వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందని మనీ ట్రాన్స్ఫర్ యాప్స్, బ్యాంక్ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఐదు శాతం చొప్పున కమీషన్ ఇస్తున్నారు. సిమ్‌కార్డులు, బేసిక్ మోడల్ సెల్ఫోన్లతో పాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్ సిద్ధమయ్యాక ఈ సైబర్ నేరగాళ్లు అసలు అంకం మొదలు పెడుతున్నారు. గూగుల్‌లో రిజిస్టర్ చేసుకుని... ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్లోకి ఎంటర్ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తమ నెంబర్లను ఆయా బ్యాంకులకు, ఆయా సంస్థలకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్’, ‘బ్యాంక్ మేనేజర్’ లేదా ఫలానా సంస్థ పేర్లతోనే రిజిస్టర్ చేసుకున్నారు. గూగుల్ సెర్చ్‌లో పొందుపరిచిన వారిలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పై భాగానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు సైబర్ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నెంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్‌నకు సంబంధించిన కాల్ సెంటర్ కోసం సెర్చ్ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచినవే ముందు కనిపిస్తుంటాయి. పరిష్కారం పేరుతో ఎం.పిన్ పంపిస్తూ... ఇలా కనిపించిన ‘కాల్ సెంటర్’ నెంబర్‌కు ఖాతాదారుడు కాల్ చేసిన వెంటనే అది సదరు సైబర్ నేరగాడికి చేరిపోతుంది. తాను బ్యాంక్ మేనేజర్ అని, ఫలానా సంస్థ ప్రతినిధి అని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నెంబర్ నుంచి ఓ ఎస్సెమ్మెస్ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నెంబర్‌కు సెండ్ చేయాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు నెరపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటూ యూపీఐగా పిలిచే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయి ఉన్న సెల్‌ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్నకుసంబంధించిన నెంబర్‌కు పంపాల్సి ఉంటుంది.దీన్నే ఈ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగామార్చుకుంటున్నారు. యాప్స్‌ను అనుసంధానిస్తూ... తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచ్చినప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నెంబర్ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను అదే నెంబర్‌కు సెండ్ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నెంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్ చేయడంతో పాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతా లేదా ఈ వ్యాలెట్ వివరాలు, పిన్ నెంబర్లు సంగ్రహించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆ వివరాలు కోరితే అనుమానించాల్సిందే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీరిలోఅత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఏ బ్యాంకైనా.. సంస్థకస్టమర్ బ్యాంకు ఖాతాకు, ఈ–వాలెట్స్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అడగదు. అలా ఎవరైనా చెప్పమన్నారంటేఅనుమానించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్‌ను ఎవరి సెల్ నెంబర్‌కు పంపకూడదు. గూగుల్‌లో చూసినవి అన్నీ నిజమైన కాల్ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. గూగుల్ పే పేరుతోనూ గూగుల్‌లో నకిలీ నెంబర్లు ఉంటున్నాయి. అపరిచితులు, ఫోన్‌ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం. – కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైమ్ ఏసీపీ -
జోమాటోకి కాల్ చేస్తే రూ.70 వేలు స్వాహా
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి ఇటీవల జోమాటో యాప్ ద్వారా రూ.200 వెచ్చించి స్వీట్లు ఆర్డర్ చేశాడు. డెలివరీ అయిన తర్వాత పరిశీలిస్తే అవి వాసన వస్తున్నట్లు గుర్తించాడు. దీంతో జోమాటో కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసిన అతడికి‘9330017233’ కనిపించింది. దానికి కాల్ చేసిన ఆయన విషయం చెప్పగా... స్పందించిన అవతలి వ్యక్తి మీరు చెల్లించిన నగదు తిరిగి ఇచ్చేస్తామని, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు యూపీఐ పిన్ పంపాలని కోరాడు. బాధితుడు అలాగే చేయగా ఆయన ఖాతాలో ఉన్న రూ.70 వేలు నేరగాళ్ల పాలయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించినబాధితుడు చివరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, సిటీబ్యూరో: ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో ఈ తరహాలో టోకరా వేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ అంతరాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టించే ఈ క్రైమ్ ఎలా సాగుతుందో వివరించారు. గత కొద్ది రోజులు గా ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పుడు వివరాలతో ఫోన్ నంబర్లు... ఇవే కాదు... ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రోనగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యవతకు కమీషన్ ఆశ చూపి తమ వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందని మనీ ట్రాన్స్ఫర్ యాప్స్, బ్యాంక్ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఐదు శాతం చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ఉనికి బయపటడకుండా... ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్లోకి ఎంటర్ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా సంస్థలతో పాటు బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ఆ తరహా పేర్లతోనే రిజిస్టర్ చేసుకున్నారు. గూగుల్ సెర్చ్‌లో పొందుపరిచిన వాటిలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పై భాగానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు సైబర్ నేరగాళ్లు ఈ నకిలీ కాల్ సెంటర్ల నంబర్లకు వ్యూస్ పెరిగేందుకుగాను థర్డ్ పార్టీ గేమ్ యాప్స్‌ను వాడుతున్నారు. ఈ గేముల్లో అంతర్గతంగా నకిలీ కాల్ సెంటర్‌కు చెందిన నంబర్ లింకు ఉండేలా చేస్తున్నారు. దీంతో ఆయా గేమ్స్ ఆడే వారు ఎన్నిసార్లు స్క్రీన్‌పై టచ్ చేస్తే అన్నిసార్లు ఆ నెంబర్ లింకు అంతర్గతంగా ఓపెన్ అయి అది వ్యూగా మారిపోతుంది. కొన్నిసార్లు పాప్అప్ యాడ్స్ వాడుతున్నారు. ఇలా ఆయా నంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు ఓ సంస్థ, బ్యాంక్‌నకు సంబంధించిన కాల్ సెంటర్ కోసం సెర్చ్ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచినవే ముందు కనిపిస్తుంటాయి. పరిష్కారం పేరుతో ఎంపిన్ పంపిస్తూ... ఇలా కనిపించిన ‘కాల్ సెంటర్’ నెంబర్‌కు ఖాతాదారుడు కాల్ చేసిన వెంటనే అది సదరు సైబర్ నేరగాడికి చేరిపోతుంది. తాను ఆ సంస్థకు లేదా బ్యాంక్‌నకు చెందిన అధికారినంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్ నుంచి ఎస్సెమ్మెస్ పంపుతామని, దానిని మళ్లీ అదే నెంబర్‌కు సెండ్ చేయాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు జరిపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటూ యూపీఐగా పిలిచే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయి ఉన్న సెల్‌ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌నకు సంబంధించిన నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వేరే యాప్స్‌ను అనుసంధానిస్తూ... తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచ్చినప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నెంబర్ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను అదే నంబర్‌కు సెండ్ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్ చేయడంతో పాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. మరికొన్నిసార్లు నగదు తిరిగి ఇవ్వడానికి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు యూపీఐ పిన్ తదితరాలు పంపమని కోరి స్వాహా చేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు గరిష్టంగా రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్ ఖా తాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు. ఆ వివరాలు పంపొద్దు ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసిన వారితో బ్యాంకు అధికారి, మేనేజర్ అంటూ పరిచయం చేసుకునే వీరిలో అత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఐ ఎంపిన్‌ను ఎవరి సెల్ నెంబర్‌కు పంపకూడదు. మెసేజ్ వచ్చినా ఏటీఎం నుంచి డబ్బు రాకుంటే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. గూగుల్‌లో చూసి అవి బ్యాంకుల కాల్ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. అనేక సందర్భాల్లో ఏటీఎం మిషన్ నుంచి బయటకు రాని డబ్బులు రెండుమూడు పని దినాల్లో తిరిగి ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. అపరిచితులు, ఫోన్ ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం.– సైబర్ క్రైమ్ పోలీసులు -
పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. ఈ మెయిల్ ఆధారిత ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తన కస్టమర్ కేర్ సెంటర్లను ఆదేశించింది. ఆయా ఫిర్యాదులను తక్షణం ఐటీ శాఖ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. పన్ను సేవల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాన్ స్టేటస్, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్ అప్లికేషన్లు, ఆదాయపు పన్ను ఫైలింగ్ ప్రక్రియ, వెల్త్ ట్యాక్స్ రిటర్న్స్, రిఫండ్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణం అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తన కస్టమర్ కేర్ సెంటర్లను ఆదేశించింది.