మీ బ్యాంక్ అకౌంట్ గురించి తెలుసుకోవాలని కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? అందుకోసం గూగుల్‌లో దొరికిన బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త
అమెరికాలో అకౌంటెంట్‌గా పనిచేసి నావీ ముంబైలో స్ధిరపడ్డ 73ఏళ్ల వృద్దుడు ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి రూ.4.02లక్షల్ని పోగొట్టుకున్నాడు.నావీ ముంబై ఖర్ఖర్ పోలీసుల కథనం ప్రకారం..నావీ ముంబైలో ఉండే వృద్దుడు తన డెబిట్ కార్డును యాక్టీవేట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే గత నెల డిసెంబర్ 25న గూగుల్‌లో సెర్చ్‌చేసి 'ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ హెల్ప్' అని ట్యాగ్ చేసిన నెంబర్‌కు కాల్ చేశాడు.
అవతలి నుంచి 'మై నేమే ఈజ్ మనీష్ గుప్తా..హౌ కెన్ ఐ హెల్ప్ యూ' అంటూ మాట కలిపాడు. దీంతో వృద్దుడు తన బ్యాంక్ డెబిట్‌కార్డ్‌ను యాక్టీవేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు, అందుకు సాయం చేయాలని కోరాడు. మనీష్ గుప్తా..అతని ఫోన్‌కు రిమోట్‌యాక్సెస్ ఇవ్వాలని, ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలని సూచించాడు. మనీష్ చెప్పినట్లే ఎనీడెస్క్ ఓపెన్ చేశాడు. వెంటనే నిందితుడు బాధితుడి అకౌంట్ డీటెయిల్స్ ను సేకరించాడు. అనంతరం బ్యాంక్ డెబిట్ కార్డ్ యాక్టీవేషన్ చేసే సమయంలో సర్వర్ చాలా స్లోగా ఉందని, డిసెంబర్ 27న ప్రాసెస్ చేస్తానని నమ్మించాడు. నిందితుడు చెప్పిన మాటలు నిజమేనని బాధితుడు నమ్మాడు.
సీన్ కట్ చేస్తే సదరు సైబర్ నేరస్తుడు బాధితుడి అకౌంట్ నుంచి పలు మార్లు ట్రాన్సాక్షన్‌లు నిర్వహించి మొత్తం రూ.4.02 లక్షల్ని కాజేశాడు. అదే సమయంలో తన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు షాక్ తిన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment