ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ యువతి నగదు పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ తెలిపిన వివరాలు. బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజు కాలనీకి చెందిన సయ్యద్ గుల్‌నార్ (21) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న క్రెడిట్‌కార్డు ఈఎంఐ యొక్క డ్యూ డేట్‌ను మార్చడానికి గూగుల్‌లో సెర్చ్ చేయగా 7718320995 అనే ఫోన్ నెంబరు కనిపించింది.
వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా కాల్ కట్ అయింది. కొద్ది సేపటి తరువాత అదే నెంబర్ నుంచి ఓ వ్యక్తికి తనకు తానుగా పరిచయం చేసుకొని హిందీలో మాట్లాడాడు. ఈమె ఈఎంఐ డ్యూ డేట్ మార్చాలని తెలిపింది. దానికి ఎనీ డెస్క్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో వచ్చిన కోడ్‌ను చెప్పాలని కోరగా అదే విధంగా చెయ్యగా స్లైస్ కార్డు నుంచి 19,740 రూపాయలు కట్ అయ్యాయి. మళ్లీ ఫోన్ చెయ్యగా పనిచేయలేదు. కొంతసేపు తర్వాత వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి కలకత్తా నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన యువతి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
(చదవండి: వీడని మూఢత్వం ... పల్లెల్లో యథేచ్ఛగా క్షుద్ర పూజలు!!)
Comments
Please login to add a commentAdd a comment