న్యూఢిల్లీ: రియల్ మీ తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ‘రియల్ మీ కేర్ సర్వీస్ సిస్టమ్’ను ప్రారంభించింది. కంపెనీ రెండో దశ వృద్ధిలోకి అడుగు పెట్టిందని, దీంతో కస్టమర్ల అంచనాలకు మించి సేవలను అందించనున్నట్టు రియల్‌మీ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కస్టమర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టచ్ పాయింట్ల ద్వారా, వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా, 1,000కి పైగా సర్వీస్ సెంటర్ల రూపంలో సులభంగా సేవలను పొందొచ్చని తెలిపింది. సోషల్ మీడియా, ఈమెయిల్, వాయిస్, వాట్సాప్, వెబ్ చాట్‌పై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment