హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది | Person was cheated with fake Cusotmer care of a courier company | Sakshi
Sakshi News home page

హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది

Published Sun, Apr 23 2023 2:10 AM | Last Updated on Tue, Apr 25 2023 12:22 PM

Person was cheated with fake Cusotmer care of a courier company

కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్‌నెట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్‌నెట్‌లోని వివిధ వెబ్‌సైట్‌ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది.

మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్‌ నంబర్లు ఇంటర్‌నెట్‌లో బోగస్‌వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్‌చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు.

కొరియర్‌ నంబర్‌ కోసం వెతికితే...

కాజీపేటకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ హైదరాబాద్‌లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్‌ను కొరియర్‌ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్‌ రాకపోయేసరికి ఇంటర్‌నెట్‌లో సంబంధిత సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం వెతికి దానికి ఫోన్‌ చేశాడు.

ఆ నంబర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్‌ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్‌ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్‌ చేయడానికి రూ.2 ఫోన్‌ ద్వారా చెల్లించాలని కోరారు.

మీకు రాము అనే కొరియర్‌ బాయ్‌ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్‌ ఇచ్చాడు. ఆ నంబర్‌కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్‌ చేరుస్తామంటూ ఓ లింక్‌ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్‌ ఖాదర్‌ ఆ లింక్‌ను క్లిక్‌చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్‌ సర్వీస్‌ అడ్రస్‌ లేకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లు చూసి అవాక్కయ్యాడు.

తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్‌ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్‌ చేయించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్‌లైన్‌ కేసులు ఒక కాజీపేట పీఎస్‌లోనే పాతికకు పైగా నమోదయ్యాయి.

ఇంటర్‌నెట్‌లోని వివిధ వెబ్‌సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్‌ కేర్‌ నంబర్‌ అని చెప్పి తమ సొంత ఫోన్‌ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్‌సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్‌సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్‌ చేసి మోసపోకూడదు.

ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్‌ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement