![డిజిటల్ క్రాప్ సర్వేతో రైతులకు మేలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mbd251-330025_mr-1738870652-0.jpg.webp?itok=BqCFjEvW)
డిజిటల్ క్రాప్ సర్వేతో రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: డిజిటల్ క్రాప్ సర్వేతో రైతులకు మేలు జరుగుతుందని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్, శనిగపురం గ్రామాల పరిధిలో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేస్తున్న యాసంగి పంటలను ప్రతి సర్వే నంబర్, సబ్ సర్వే నంబర్‌లో ఫొటోలు తీసి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. సర్వే నిర్వహించాల్సిన రెవెన్యూ గ్రామాలు, సర్వే నంబర్లు, భూములు హద్దులతో కూడిన మ్యాప్‌లను ధరణి పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలకు వెళ్లి 25 మీటర్ల దూరంలో ఉండి మాత్రమే ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, ఏఈఓ బి.సాయిప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.
పారదర్శకంగా చేపట్టాలి..
నెల్లికుదురు: రైతుల యాసంగి వ్యవసాయ పంటల నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా చేట్టాలని ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని ఆలేరు రెవెన్యూ గ్రామ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న యాసంగి పంటల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని గురువారం ఏఓ యాస్మిన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ మణికంఠ, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment