![ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mbd153-330022_mr-1738870653-0.jpg.webp?itok=ipXSkSqp)
ప్రశాంతంగా ప్రాక్టికల్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఐఈఓ సీహెచ్.మదార్‌గౌడ్ గురువారం తెలిపారు. జనరల్ సైన్స్, ఒకేషనల్ కోర్సులో ఉదయం జరిగిన పరీక్షల్లో 319 మంది విద్యార్థులకు 310 మంది హాజరై.. 9మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 330 మంది విద్యార్థులకు 300 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఓకేషనల్ జూనియర్ కళాశాలలో పరీక్షల విభాగం అధికారులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment