ఉత్తమ ఫలితాలే లక్ష్యం!
మార్చి 21 నుంచి..
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కఠిన పరీక్షలు ఎదుర్కొవా
ల్సిన పరిస్థితి నెలకొంది.
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఉపాధ్యాయుల బోధనకు కొలమానంగా నిలుస్తాయి. వచ్చిన ఫలితాల ఆధారంగానే ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. కాగా 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లా 94.62శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. అయితే నూతన జిల్లాలు ఏర్పాటు నుంచి పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత శాతంలో వెనుకబడి ఉంది. కాగా ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో బోధన జరుగుతోంది.
ఏ స్థానమో..
జిల్లాలోని మోడల్ స్కూళ్లు, కేజీవీబీలను కలుపుకొని 126 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా జిల్లా మొత్తానికి 18మంది మాత్రమే ఇన్‌చార్జ్ ఎంఈఓలు కొనసాగుతున్నారు.కాగా సరైన పర్యవేక్షణలేక విద్యా వ్యవస్థ రోజురోజుకూ కుంటుపడుతోంది. ఈ సారైనా ఉత్తామ ఫలితాలు సాధించడానికి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కసరత్తు చేస్తారో, మానుకోట జిల్లాను ఏ స్థానంలో నిలుపుతారో వేచి చూడాల్సిందే.
జిల్లాలో 8,754 మంది విద్యార్థులు
జిల్లాలో ఈ ఏడాది 8,754 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా ఉత్తమ ఫలితాల కోసం కలెక్టర్, డీఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని, ఫలితాల్లో జిల్లాను ముందుంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment