105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
బాలికలు స్వీయ రక్షణలో
ముందుండాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్: బాలికలు చదువుతో పాటు స్వీయ రక్షణలో ముందుండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో బాలబాలికలు సమానమన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలికలు అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయాలన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కకరించుకుని బేటి బచావో–బేటి పడావో నినాదంతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వివిధ క్రీడాపోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై న బాలికలను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ధనమ్మ, డీఈఓ రవీందర్‌రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, డీఎంహెచ్‌ఓ మురళీధర్, సీడీపీఓలు శిరీష, నీలోఫర్, ఎల్ల మ్మ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
నాణ్యమైన ఎరువులు
విక్రయించండి
● డీఏఓ విజయనిర్మల
గూడూరు: నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. మండల కేంద్రంతో పాటు మచ్చర్ల, అప్పరాజ్‌పల్లి గ్రామాల్లోని ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆమె ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఎరువుల స్టాక్ రిజిస్టర్‌లు, బిల్ బుక్కులను చూసి, ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారితో అప్‌డేట్ చేయించుకోవాలని, ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులను విక్రయించాలని యజమానులకు సూచించారు. అనంతరం మర్రిమిట్టలో డిజిటల్ క్రాప్ సర్వేను పర్యవేక్షించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, ఏఈఓలు పాల్గొన్నారు.
బాలికలు ఉన్నత
శిఖరాలు అధిరోహించాలి
● స్టేట్ జెండర్ కోఆర్డినేటర్ శిరీష
మరిపెడ రూరల్: బాలికలు ఇష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని స్టేజ్ జెండర్ కోఆర్డినేటర్ హజారి శిరీష అన్నారు. గురువారం మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్డులోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. ముందుకు స్టేట్ జెండర్ కోఆర్డినేటర్‌కు విద్యార్థినులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలను సందర్శించి 10వ తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థినుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు భారంగా మారకుండా గొప్పస్థాయికి ఎదగాలన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జెండర్ కోర్డినేటర్ గుండ్ల విజయకుమారి, పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
తగ్గిన మిర్చి ధరలు..
తెగుళ్లతో పంట
దిగుబడి అంతంతే
● గతేడాది క్వింటాకు రూ.20 వేల నుంచి
రూ.23వేల వరకు ధర
● ప్రస్తుతం రూ.12 వేల నుంచి
రూ.14 వేల వరకు ఖరీదు
● రేట్లు అమాంతం పడిపోవడంతో
రైతుల లబోదిబో
● మరోవైపు మార్కెట్‌లో
క్యాష్ కటింగ్ దోపిడీ
కేసముద్రం:
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు చివరికి అప్పులు, కన్నీళ్లే మిగులుతున్నాయి. ముఖ్యంగా మిర్చి ధర పడిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగు చేశారు. ఒక వైపు తెగుళ్లతో అంతంత మాత్రంగానే దిగుబడి రాగా.. మరోవైపు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కాగా గత ఏడాది మిర్చికి గరిష్ట ధర క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు పలికింది. దీంతో ఈ ఏడాది కూడా ధర కలిసి వస్తుందనే ఆశతో ఎకరాకు రూ.1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టి, మిర్చి పంట సాగు చేసిన రైతులకు చివరికి కన్నీరే మిగిలింది.
మేలు రకం మిర్చికి రూ.రూ.13,739..
గత ఏడాది కేసముద్రం మార్కెట్‌కు 32,926 క్వింటాళ్ల మిర్చి(తేజరకం), 5,734 క్వింటాళ్ల తాలురకం మిర్చి అమ్మకానికి వచ్చింది. ఈమేరకు తేజరకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.23,059 పలుకగా, కనిష్ట ధర రూ.10వేల వరకు పలికింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్‌కు 3,593 క్వింటాళ్ల తేజరకం మిర్చి, 606 క్వింటాళ్ల తాలురకం మిర్చి అమ్మకానికి వచ్చింది. ఈ మేరకు గురువారం మార్కెట్‌లో తేజరకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.13,739పలుకగా, కనిష్ట ధర రూ.6,212, తాలురకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.6,588, కనిష్ట ధర రూ.5,511 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
ఇదో రకం దోపిడీ..
కేసముద్రం మార్కెట్‌లో ఇ–నామ్ విధానం ద్వారా సరుకులు కొనుగోలు చేసి.. అదే రోజు తేదీ వేసిన చెక్కులను రైతులకు ఇవ్వాలి. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యాపారులు వాయిదా పద్ధతుల్లో చెక్కులను ఇస్తున్నారు. మరోవైపు రూ.100కు రెండు శాతం క్యాష్ కటింగ్ చేసుకొని రైతులకు నగదు చెల్లిస్తున్నారు. అదే చెక్కు ఇస్తే ఒకశాతం క్యాష్ కటింగ్ పెడుతున్నారు. ఇక మిర్చి బస్తాలను తూకం వేసే సమయంలో.. ఒక బస్తా 49 కేజీలు దాటి ఉంటే బస్తాకు కేజీ చొప్పున మిర్చిని కట్ చేస్తున్నారు. ఇలా క్యాష్ కటింగ్‌తోపాటు, మిర్చిలో కోత పెడుతూ వ్యాపారులు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని కొందరు వ్యాపారులు 3శాతం కటింగ్ చేస్తున్నారని, అదే విధంగా వాయిదా పద్ధతుల్లో ఇతర బ్యాంకు చెక్కులు ఇస్తున్నారని, దీంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు.
మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. రైతులు 4,885 బస్తాల మిర్చిని తీసుకొచ్చారని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ పేర్కొన్నారు. తేజ రకం మిర్చి 3,859 బస్తాలు రాగా క్వింటా గరిష్ట ధర రూ.14,050, కనిష్ట ధర రూ. 10,500 పలికిందన్నారు. తాలు రకం మిర్చి 1,026 బస్తాలు రాగా క్వింటా గరిష్ట ధర రూ.7,160, కనిష్ట ధర రూ.6,010మేరకు పలికిందని వారు తెలిపారు.
2శాతం క్యాష్ కటింగ్ చేశారు..
ఎకరం భూమిలో మిర్చి పంట వేశా. అప్పుతెచ్చి మరి పంటకు పెట్టుబడి పెట్టా. సుమారు రూ.1.50లక్షల వరకు పంటకు ఖర్చు అయింది. పంటకు తెగులు సోకడంతో కేవలం 6 క్వింటాళ్ల మిర్చి చేతికి వచ్చింది. అమ్ముకుందామని మార్కెట్‌కు వచ్చా. క్వింటాకు ధర రూ.13,629పెట్టారు. తూకంలో మూడు బస్తాలు 50 కేజీలు రాగా, ఒక్కో బస్తాకు కేజీ చొప్పున మూడు కేజీల మిర్చిని కట్ చేశారు. వ్యాపారి నగదు డబ్బులు ఇచ్చి, రెండుశాతం క్యాష్ కటింగ్ కింద రూ.1,639 కట్ చేశాడు. ఇలా రైతులను మోసం చేస్తున్నారు.
– మనుగొండ యాకయ్య, రైతు, పెనుగొండ
రూ.12,699 ధర పెట్టారు
నాకున్న ఎకరం భూమిలో మిర్చి పంట వేశా. దాదాపు పంటకు రూ.1.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పంటకు తెగుళ్లు సోకడంతో 8 క్వింటాళ్ల మిర్చి మాత్రమే చేతికి వచ్చింది. మార్కెట్‌లో అమ్ముదామని వస్తే క్వింటాకు ధర రూ.12,699 పెట్టిండ్రు. పైగా నగదు డబ్బులు ఇచ్చినందుకు 2శాతం క్యాష్ కటింగ్ చేశారు. గత ఏడాది క్వింటాకు రూ.20 వేలకు పైగా ధర ఉండగా, ఈసారి అమాంతం తగ్గించారు. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో నష్టపోయాం.
– లావుడ్యా బాలు, బిచ్చానాయక్‌తండా
●
● పదో తరగతి ఉత్తీర్ణతలో
జిల్లాను ముందుంచేలా చర్యలు
● మార్చి 21నుంచి వార్షిక పరీక్షలు
● సన్నద్ధమవుతున్న విద్యార్థులు
న్యూస్‌రీల్
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
Comments
Please login to add a commentAdd a comment