ఇంటి పన్నులు వసూలు చేయాలి
● జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్
గూడూరు: గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటా పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పన్నుల వసూలును పరిశీలించారు. అనంతరం జీపీ పరిధిలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. ఈ మూడింటిని సక్రమంగా నిర్వహించాలని, సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేయించాలని కార్యదర్శికి సూచించారు. ప్లాస్టిక్ కవర్లు బయట పడేయకుండా డంపింగ్ యార్డులోనే వేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment