కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
నెహ్రూసెంటర్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు జి.నాగయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో బయ్యారం ఉక్కు పరి శ్రమ ఏర్పాటు చేయాలని జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి విస్మరించాయని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సోమయ్య, రాజన్న, వెంకన్న, వీరన్న, శ్రీనివాస్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య
Comments
Please login to add a commentAdd a comment