నెల్లికుదురు: మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి, మిల్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు ఏసీఎస్‌ఓ జె.రమేశ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ బస్టాండ్ సమీపంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు గ్రామస్తులు నుంచి ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు సివిల్ సప్లయీస్, విజిలెన్స్ ఎన్‌ఫోర్‌మెంట్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశామన్నారు.
ఈ మిల్లు సీఎంఆర్ పెట్టడం లేదన్నారు. సీఎంఆర్ పెట్టేందుకు గ్రామాల్లో బ్రోకర్ల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా నిల్వ చేశారని, 105 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి మిల్లుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని కేసముద్రం ఎంఎల్‌ఎస్ గోదాంకు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు రాకేష్, అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment