![గడువులోగా లక్ష్యం సాధించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06hmkd54-330086_mr-1738870603-0.jpg.webp?itok=aH7i4O9k)
గడువులోగా లక్ష్యం సాధించాలి
హన్మకొండ: గడువులోగా లక్ష్యం సాధించాలని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రాంచ్‌ల వారీగా, ప్రధాన కార్యాలయంలో విభాగాల వారీగా ప్రగతి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరుచుకోని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీబీ సీఈఓకు సూచించారు. మాఫీ పొందిన రైతులకు పంట రుణాలు త్వరితగతిన ఇవ్వాలన్నారు. సాంకేతిక కారణాలతో పంట రుణమాఫీ కాని రైతుల ఖాతాలు మెరుగు పరిచి వారికి మాఫీ లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. నిబంధనల మేరకు 2025 సంవత్సరానికి గాను నిరార్ధక రుణాలుగా వర్గీకరించిన మొండి బకాయిలను 2 శాతానికి మించకుండా రికవరీ చేయాలని మేనేజర్లను ఆదేశించారు. నిరార్ధక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా టర్నోవర్ రూ.2,500 కోట్లకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. రిజర్వు బ్యాంకు, నాబార్డు ఆదేశాలు పాటిస్తూ డీసీసీబీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
Comments
Please login to add a commentAdd a comment