8న శనివారం
ఉదయం 8.30 గంటలకు ప్రాతఃకాల పూజలు, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయంలో చండీ పారాయణం, అనివెట్టి మండపంలో సహస్ర ఘటాభిషేకం, మధ్యాహ్నం 12.30గంటలకు మహా నివేదన తరువాత ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారు. 3.30 నుంచి శత చండీ హోమం నిర్వహిస్తారు. రాత్రి7గంటలకు మంగళంపల్లి వేణుగోపాల శర్మతో ప్రవచనాలు చేస్తారు. రాత్రి 8గంటల నుంచి కూచిపూడి నృత్యం ఉంటుంది.
7న శుక్రవారం
ఉదయం ఆరు గంటలకు మేళతాళాలు, వేద మంత్రాలతో వేద పండితులతో కలిసి త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ఐదు కలశలాతో పవిత్ర గోదావరి జలాలు తీసుకువస్తారు. ఆ కలశాల జలాలను 1,180 కలశాలతో కలిపి పూజ చేస్తారు. 7.30గంటలకు గోపూజ, గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.30గంటలకు మహా నివేదన అనంతరం ఉచిత పులిహోర ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 3.30గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రాత్రి 7గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కూచిపూడి నృత్యం, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
9న ఆదివారం
ఉదయం7.30 గంటల నుంచి ప్రాతఃకాల పూజ, రుద్ర హోమం, బలి ప్రధానం చేస్తారు. 10గంటలకు మహా పూర్ణాహుతి చేస్తారు.10.42 గంటలకు మహాకుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు పీఠాధిపతులతో అనుగ్రహ భా షణం చేస్తారు. 11.20 గంటలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి ప్రవచనం కార్యక్రమం వినిపిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు దాతలకు ఆశీర్వచనం, కలశాల వితరణ చేస్తారు. 12.30గంటలకు మహా నివేదన అనంతరం ఉచిత ప్రసాదం, అన్నదానం కార్యక్రమాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా జరుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment